సినిమాల విషయంలో ప్రేక్షకులకు సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి.ఒక వ్యక్తికి ఒక సినిమా అద్భుతం అని అనిపిస్తే అదే సినిమా మరొకరికి తలనొప్పి తెప్పిస్తుంది.
కొంతమంది సినిమాలలో కథ, కథనం, లాజిక్ లకు ప్రాధాన్యత ఇస్తే మరి కొందరు మాత్రం యాక్షన్ సన్నివేశాలు, పాటలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.కొందరు ప్రేక్షకులు క్లాస్ సినిమాలను ఇష్టపడితే మరి కొందరు ప్రేక్షకులు మాస్ సినిమాలను ఇష్టపడతారు.
అయితే కేజీఎఫ్ గొప్ప మూవీనా కేరాఫ్ కంచరపాలెం అనే మూవీ గొప్ప మూవీనా అనే ప్రశ్నకు 80 శాతం మంది కేజీఎఫ్ కే ఓటేస్తున్నారు.వెంకటేశ్ మహా కామెంట్ల నేపథ్యంలో చాలామంది ప్రేక్షకులు తమకు కెజీఎఫ్ మూవీనే నచ్చిందని చెబుతున్నారు.
ఈ వివాదం మొదలయ్యే వరకు వెంకటేశ్ మహా ఎవరో కూడా తమకు తెలియదని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.
వాస్తవానికి ప్రేక్షకులు తమకు నచ్చితే ఎలాంటి సినిమానైనా ఆదరిస్తారు.పుష్ప, సీతారామం సినిమాలకు కథ పరంగా చిన్నపాటి పోలిక లేకపోయినా ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.గత వారం విడుదలైన చిన్న సినిమా బలగం పేరున్న స్టార్ క్యాస్ట్ లేకపోయినా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.
కేజీఎఫ్ గొప్పదా కంచరపాలెం గొప్పదా అంటే రెండూ గొప్ప సినిమాలే కానీ కమర్షియల్ సక్సెస్ విషయంలో కేజీఎఫ్ గొప్ప మూవీ అని చెప్పవచ్చు.
దర్శకుడు వెంకటేశ్ మహా చెప్పిన లాజిక్ కు కేజీఎఫ్ మూవీకి లింక్ లేదు.ప్రశాంత్ నీల్ అంత గొప్ప సక్సెస్ ను సాధించినా మరే దర్శకుడిని కించపరిచేలా మాట్లాడలేదు.ప్రేక్షకులకు సినిమా నచ్చితే 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార తరహా సినిమాలు సైతం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటాయి.