ప్రపంచ మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్ ఇండియాలో పర్యటిస్తున్న వేళ, చాలా ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.అవును, బిల్ గేట్స్ తాజాగా ఎవరూ ఊహించని సర్‌ప్రైజ్ చేసి ఆహూతులకు కనువిందులు చేసారు.
విషయం ఏమంటే, ఇండియాలో ఆయన ఎలక్ట్రిక్ రిక్షాను నడిపించి అందరికీ ఆశ్చర్య చకితుల్ని చేసారు.మహేంద్ర కంపెనీకి చెందిన ట్రియో ఎలక్ట్రిక్ రిక్షాను ఇండియన్ రోడ్లపై నడుపుతూ హల్‌చల్ చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియో బిల్ గేట్స్ తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్టు చేయగా తెగ వైరల్ అవుతోంది.

బిల్ గేట్స్ చేసిన పోస్టుపై మహేంద్ర కంపెనీ చైర్మెన్ ఆనంద్ మహేంద్ర వెంటనే స్పందించారు.బిల్‌గేట్స్ షేర్ చేసిన వీడియోకి ఆనంద్ మహేంద్ర ట్వీట్ చేస్తూ “చల్తీ కా నామ్ బిల్ గేట్స్‌కి గాడి” అంటూ కామెంట్ చేయడం విశేషం.ఆవిష్కరణల కోసం భారతీయుల తపన ఎన్నటికీ తీరిపోదని, నేనో ఎలక్ట్రిక్ రిక్షాను నడిపాను అంటూ సదరు వీడియోకి బిల్‌గేట్స్ క్యాప్షన్ ఇవ్వడం కొసమెరుపు.
కాగా ఆ రిక్షా 131 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని, ఈ రిక్షాలో నలుగురు ప్రయాణికులు చాలా సౌకర్యంగా ట్రావెల్ చేయగలరని చెప్పారు.

ఇకపోతే ట్రాన్స్‌పోర్టు ఇండస్ట్రీలో కార్బన్‌రహిత వాహనాలకు మహేంద్ర కంపెనీ ఆదర్శనీయంగా నిలుస్తుందని బిల్ గేట్స్ ఆ వీడియోకు కామెంట్ కూడా చేయడం విశేషం.ట్రియో వాహనాన్ని నడిపే సమయం మీకు దొరికినందుకు గర్వంగా ఉందంటూ ఆనంద్ మహేంద్ర తన ట్వీట్‌లో చెప్పడం జరిగింది.మీ తర్వాత ట్రిప్‌లో త్రీవీలర్ ఎలక్ట్రిక్ వాహనాలతో రేస్‌లో పాల్గొందామని, ఆ రేసులో మీరు, నేను, సచిన్ ఉంటారని ఆనంద్ మహేంద్ర తెలిపారు.
కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.







