హిందూ ఆచార వ్యవహారాలను కాపాడడంలో ఉత్సవాలు కీలక భూమిక పోషిస్తాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ జగదీశ్ రెడ్డి అన్నారు.మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన దేవాలయాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.సీఎం కేసీఆర్ ప్రత్యేక పర్యవేక్షణలో తెలంగాణలో ఉన్న చారిత్రక దేవాలయాలకు భారీగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నామని గుర్తు చేశారు.
ఉత్సవాలలో భాగంగా రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడలను నిర్వహించిన దేవాలయ సమన్వయ కమిటీని మంత్రి అభినందించారు.ముందుగా దేవాలయ అర్చకులు ముడుంబయ్ రఘువర కృష్ణమా చార్యులు ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ప్రత్యేక పూజల అనంతరం వేద ఆశీర్వచనం చేశారు.
రసవత్తరంగా జరిగిన జీజేఆర్ కబడ్డీ పోటీలు
శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పిల్లలమర్రిలో నిర్వహించిన జిజేఆర్ రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ కబడ్డీ పోటీలు మూడు రోజులు రసవత్తరంగా జరిగాయి.ఫైనల్ మ్యాచ్ ను మంత్రి జగదీష్ రెడ్డి టాస్ వేసి ప్రారంభించారు.మ్యాచ్ పూర్తయ్యేవరకు ఆద్యంతం తిలకించి అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్,జెడ్పీటీసీ జీడి భిక్షం,ఎంపీపీ నెమ్మాది భిక్షం,దేవాలయ సమన్వయ కమిటీ సభ్యులు రాపర్తి మహేష్ కుమార్,కొరివి సతీష్, లోడంగి నాగరాజు,సట్టు పుష్ప,బంగారి చిన మల్లయ్యలు ఉన్నారు.