తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో తీర్పు వెలువరించింది హైదరాబాద్ లోని నాంపల్లి న్యాయస్థానం.ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డిని దోషిగా తేల్చింది.
అదేవిధంగా మిగతా 11 మందిపై ఉన్న కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది.ఈ క్రమంలోనే నిందితుడికి ఈనెల 9న శిక్ష ఖరారు చేయనుంది.
అయితే ఈ కేసుకు సంబంధించి 23 పేజీల ఛార్జిషీట్ ను జూబ్లీహిల్స్ పోలీసులు దాఖలు చేశారు.మొత్తం 73 మంది సాక్షులను విచారించారు.
కాగా 2019వ సంవత్సరం జనవరి 31న జయరాం హత్యకు గురైన సంగతి తెలిసిందే.