వేసవికాలం వచ్చిందంటే నిరంతరం ఫ్యాన్లు, ఏసీలు నడుస్తూనే ఉంటాయి.ఒక్క ఐదు నిమిషాలు కరెంట్ పోయిన చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.
మార్కెట్లో వస్తున్న కొత్త కొత్త ఫ్యాన్లు, ఏసీలు ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి.చూడడానికి కాస్త కొత్తగా అనిపించే బజాజ్ క్లిప్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ ధర, ఫీచర్స్ చూస్తే కొనకుండా ఉండలేరు.
ఒకరికి పర్సనల్ గా గాలి కావాలి అనుకుంటే ఈ ఫ్యాన్ చాలా బెటర్.ఉద్యోగం చేసే వాళ్లకు, దుకాణాలలో కూర్చునే వాళ్లకు, ఒకచోట కూర్చుని పర్సనల్ చేసుకునే వారికి సెట్ అవుతుంది.

ఈ ఫ్యాన్ చాలా తేలికగా కేవలం 430 గ్రాముల బరువుతో ఉంటుంది.దీనిని ఆన్ చేయటానికి ఒక పుష్ బటన్ ఉంటుంది.మూడు బ్లెడ్స్ ఉన్న ఈ ఫ్యాన్ 5 వొల్టేజ్ తో పనిచేస్తుంది.ఇది 158 మిల్లీలీటర్ల పొడవు, 95 మిల్లీలీటర్ల వెడల్పు, 204 మిల్లీమీటర్ల ఎత్తు కలిగి ఉంది.
ఈ ఫ్యాన్ కు ఒక భారీ క్లిప్ అమర్చి ఉండడం వల్ల ఇది టేబుల్ ఫ్యాన్, మౌంటెడ్ ఫ్యాన్ లాగా వినియోగించుకోవచ్చు.దీనిని చార్జింగ్ చేసుకోవడం కోసం ఒక యూఎస్బీ పోర్ట్ ఉంటుంది.
దీనికి లిథియం అయాన్ బ్యాటరీ అమర్చబడి ఉంటుంది.ఒకసారి ఫుల్ చేసిన చార్జింగ్ పెడితే నిరంతరం నాలుగు గంటలు 10w హై స్పీడ్ తో తిరుగుతుంది.

దీనిని చార్జింగ్ చేసుకొని కరెంటు లేని సమయాలలో వంట గదిలో పనిచేసినవారు, లాప్టాప్, డెస్క్ టాప్ ల ముందు పని చేసేవారు వినియోగించుకోవచ్చు.ఈ ఫ్యాన్ ధర రూ.1620 అయితే 39% డిస్కౌంట్ తో రూ.984 లకు అమెజాన్ లో అందుబాటులో ఉంది.ఈ ఫ్యాన్ బజాజ్ PYGMY Mini 110MM 10W హై స్పీడ్ ఆపరేషన్ పేరుతో అమెజాన్ లో అందుబాటులో ఉంచారు.







