నేను అమెరికా అధ్యక్షుడినైతే విద్యా శాఖ, ఎఫ్‌బీఐలను రద్దు చేస్తా : భారత సంతతి నేత వివేక్ రామస్వామి

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా రెండేళ్లు వుండగానే.అప్పుడే అక్కడ ఎన్నికల వేడి రాజుకుంది.

 If Elected, Will Dismantling The Department Of Education Along With The Fbi Vive-TeluguStop.com

ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని డెమొక్రాట్లు, రిపబ్లికన్ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, ప్రముఖులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక రిపబ్లికన్ పార్టీకి సంబంధించి ట్రంప్ మరోసారి పోటీ చేయాలని గట్టి పట్టుదలగా వున్నారు.ఈయనతో పాటు భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ సైతం పోటీకి సిద్ధమయ్యారు.

వీరికి పోటీగా మరో భారత సంతతి నేత వివేక్ రామస్వామి కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు.అంతేకాదు.

ఆయన ప్రచారాన్ని సైతం ప్రారంభించారు.

Telugu Harvard Yale, Nikki Haley, Trump, Vivek Ramaswamy, Fbivivek-Telugu NRI

ఈ క్రమంలో శనివారం కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వివేక్ సంచలన ప్రకటన చేశారు.తాను అధ్యక్షుడినైనే విద్యాశాఖను, దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐలను రద్దు చేస్తానని వ్యాఖ్యానించారు.అలాగే చైనాతో అమెరికన్ సంస్థలు వ్యాపారాలు చేయకుండా నిషేధం విధిస్తానని వివేక్ పేర్కొన్నారు.

అయితే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన అమెరికా ఫస్ట్ విధానం తనకు స్పూర్తి అని రామస్వామి తెలిపారు.ప్రస్తుతం జాతి, లింగం, వర్ణం, పర్యావరణం అనేవి అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telugu Harvard Yale, Nikki Haley, Trump, Vivek Ramaswamy, Fbivivek-Telugu NRI

37 ఏళ్ల రామస్వామి బిలియనీర్.ప్రస్తుతానికి నిజనిర్ధారణ మిషన్‌లను ప్రారంభించి, అయోవాలో పలు ఈవెంట్‌లలోనూ అతను పాల్గొంటున్నాడు.భారతీయ వలసదారులకు జన్మించారు వివేక్ రామస్వామి.ఈయన తండ్రి జనరల్ ఎలక్ట్రిక్ ఇంజనీర్.తల్లి డాక్టర్.ఈ దంపతులకు రామస్వామి సిన్సినాటిలో జన్మించారు.

హార్వర్డ్, యేల్ యూనివర్సిటీలలో ఆయన చదువుకున్నారు.ఈయన సంపద విలువ 500 మిలియన్ అమెరికన్ డాలర్లు.

అమెరికాలో విజయవంతమైన బయోటెక్ వ్యవస్థాపకుడిగా వివేక్ రామస్వామి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయన కంపెనీ ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ఐదు ఔషధాలు సహా పలు మందులను అభివృద్ధి చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube