రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుందని మీలో ఎంతమందికి తెలుసు? అవును, పైన పేర్కొన్నట్టు దాదాపు 16 లోన్ యాప్స్ కి సంబందించినటువంటి ఫైనాన్స్ కంపెనీల లైసెన్స్‌ను రద్దు చేసింది.నిబంధనలను సదరు కంపెనీలు అతిక్రమించడంతో లైసెన్స్ క్యాన్సిల్ చేసినట్లు ఆర్‌బీఐ తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ క్రమంలో రినో ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లైసెన్స్ రద్దు చేసినట్టు ఆర్‌బీఐ వెల్లడించింది.రుణ మంజూరులో అక్రమ పద్ధతులను పాటించడం వల్లనే దానికి ఈ గతి పట్టినట్టు తెలుస్తోంది.

మరీ ముఖ్యంగా ఈ ఫైనాన్స్ కంపెనీ పలు థర్డ్ పార్టీ లోన్ యాప్స్‌తో కలిసి కస్టమర్లకు రుణాలు అందిస్తోంది.రూల్స్ అతిక్రమణ నేపథ్యంలో ప్రజా ప్రయోజనాల కోసం రినో ఫైనాన్స్ లైసెన్స్‌ను క్యాన్సిల్ చేసినట్లు ఆర్‌బీఐ సదరు ప్రకటనలో తెలపడం గమర్హం.అలాగే ఈ ఫైనాన్స్ కంపెనీ కస్టమర్ల దగ్గరి నుంచి భారీగా వడ్డీని వసూలు చేస్తోందని, వారు అడిగిన డబ్బు ఇవ్వని యెడల లోన్ రికవరీలో వేధింపులకు పాల్పడుతోందని ఆర్‌బీఐ తెలిపింది.కాగా రినో ఫైనాన్స్ కంపెనీకి ఆర్‌బీఐ 2000 అక్టోబర్ 16న లైసెన్స్ అందించింది.
కాగా ఇప్పుడు దాన్ని రద్దు చేసింది.

ఇకపోతే రినో ఫైనాన్స్ కంపెనీ అనేది “హెలో లోన్, కూకూ క్యాష్, క్రెడిట్ హబ్, ఫ్లాష్ లోన్, క్రేజీ బీ, క్రెడిట్ వాలెట్, బ్రిడ్జ్ లోన్, క్యాష్‌టీఎం, యూయూ క్యాష్, క్రెడిట్ రూపీ, రూపీ ప్లస్, క్యాష్ డాడీ, క్యాషిన్, క్రెడిట్ క్లబ్, గెట్ రుపీ, రుపీ బస్” వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వాకా కస్టమర్లకు రుణాలు అందిస్తోంది.అందువల్ల యాప్స్ ఉపయోగించే వారు అంటే ఈ యాప్స్ ద్వారా లోన్ తీసుకున్న వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలని మనవి.కాగా ఆన్‌లైన్‌లో లోన్ తీసుకోవాలని భావించే వారు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి.
ఆర్‌బీఐ నుంచి అమనుతి పొందిన ఫైనాన్స్ కంపెనీలు ద్వారా నడిచే యాప్స్ ద్వారానే లోన్స్ తీసుకోవడం ఉత్తమం.లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.







