భారీ కాన్వాయ్ తో అత్తారింటికి బయలుదేరిన కొత్త పెళ్లికొడుకు.. వైరల్ అవుతున్న వీడియో!

గత కొంతకాలంగా మంచు మనోజ్ భూమా మౌనికల ప్రేమ వ్యవహారం గురించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అన్నింటికి ఈ జంట మార్చి మూడవ తేదీ పెళ్లి బంధంతో చెక్ పెట్టారు.ఇలా మూడుముళ్ల బంధంతో మార్చి మూడవ తేదీ హైదరాబాదులోని ఫిలింనగర్లోని మంచు లక్ష్మి నివాసంలో అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు.

 Manchu Manoj Mounika Headed To Kurnool With Huge Convoy Details, Huge Convoy,mou-TeluguStop.com

ఇలా మనోజ్ మౌనికల వివాహ వేడుకలకు సంబంధించిన పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ క్రమంలోనే కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇకపోతే మంచు లక్ష్మి ఇంట్లో వీరి వివాహం జరగగా మౌనిక మనోజ్ దంపతులు మంచు లక్ష్మి ఇంటి నుంచి నేరుగా తమ సొంత ప్రాంతమైనటువంటి కర్నూలుకు బయలుదేరారు.ఇలా పెళ్లి తర్వాత మనోజ్ అత్తారింటికి బయలుదేరారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.భూమ కుటుంబానికి రాజకీయ పలుకుబడి ఉన్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే భారీ కాన్వాయ్ తో, భారీ బందోబస్తు నడుమ వీరి ప్రయాణం కొనసాగింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ముందుగా ఈ కొత్త దంపతులు ప్రొద్దుటూరు వెళ్లి అక్కడ తమ సమీప బంధువుల ఆశీర్వాదం తీసుకోనున్నారు.అనంతరం ఆళ్లగడ్డ సమీపంలో మౌనిక తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి సమాధి వద్దకు చేరుకొని వారి ఆశీర్వాదం తీసుకోనున్నారు.అనంతరం ఈ దంపతులు కర్నూలు బయలుదేరుతున్నారు.ఇలా సీమ అల్లుడు పెళ్లి తర్వాత మొదటిసారి సీమలోకి అడుగుపెడుతుండడంతో ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారాయి.ఇకపోతే ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం.2015 వ సంవత్సరంలో మనోజ్ ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.అయితే కొన్ని కారణాల వల్ల తనకు విడాకులు ఇచ్చారు.ఇక అంతకుముందే మౌనిక వివాహం కూడా బెంగళూరుకి చెందిన వ్యాపారవేత్తతో జరిగింది.ఒక బాబు పుట్టిన తర్వాత వీరిద్దరు కూడా విడిపోవడంతో మనోజ్ మౌనిక ప్రేమలో పడి వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటిగా మారారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube