తస్మాత్.జాగ్రత్త! మీరు ఇక్కడ పేర్కొన్న విషయాలను నిశితంగా పరిశీలించండి.
మీరు మార్చి 31లోపు పలు అంశాలను పూర్తి చేసుకోవాల్సి ఉంది.లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఈ నెల చివరకు వచ్చేసరికి పలు అంశాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది.ఎందుకంటే చాలా వాటికి మార్చి 31 డెడ్‌లైన్ ఉంది.
ఎందుకంటే, వచ్చే నెల నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది.అందులో మొదటిది.
పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.దీనికి మార్చి 31 గడువుగా ఉంది.
ఒకవేళ ఆధార్ కార్డుతో లింక్ చేసుకోకపోతే ఆ పాన్ కార్డు చెల్లదని గుర్తు పెట్టుకోవాలి.

పాన్ కార్డు చెల్లుబాటు కాకపోతే బ్యాంక్ అకౌంట్ తెరవడం కష్టం.స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయలేరు.అలాగే టీడీఎస్ వంటివి ఎక్కువగా కట్ అవుతాయి.పాన్ ఆధార్ లింక్ లేట్ ఫీజు రూ.1000గా ఉంది.అందువల్ల చాలా ఇబ్బందులు పడతారు.ఈ లిస్టులో ఇక రెండవది ‘ప్రధాన్ మంత్రి వయ వందన యోజన స్కీమ్.” ఇది మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో వుంది.అందువల్ల సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరాలని భావిస్తే.
వెంటనే ఆ పని పూర్తి చేసుకోండి.ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ వస్తోంది.

ఈ లిస్టులో ఇక 3వది 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎవరైనా ట్యాక్స్ సేవింగ్ పొందాలని అనుకుంటే మార్చి 31లోపు డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవాలి.వివిధ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ డిడక్షన్ అనేది ఉంటుంది.అదే విధంగా 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్‌డేటెడ్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయడానికి ఈ మార్చి 31తో గడువు ముగుస్తుంది.
ఇక ఐటీఆర్‌లో ఏదైనా ఆదాయాన్ని చేర్చడం మరిచిపోయిన వారు ఈ అప్‌డేటెడ్ ఐటీఆర్ దాఖలు చేయొచ్చు.అసెస్‌మెంట్ ఇయర్ తర్వాత గరిష్టంగా 24 నెలలలోపు ఇలా ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.







