సిక్కు గురుద్వారాపై తూటాల వర్షం.. విస్కాన్సిన్ నరమేధానికి 11 ఏళ్లు, మృతులకు భారత సంతతి వ్యక్తి ఘన నివాళి

అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.నగదు, నగలు కోసం హత్యలు చేసేవారు కొందరైతే.

 2012 Wisconsin Gurdwara Shooting Sikh Motorcyclist To Ride Against Hate Details,-TeluguStop.com

జాతి, వర్ణ వివక్షలతో ఉన్మాదులుగా మారేవారు మరికొందరు.ఏది ఏమైనా అక్కడ గన్ కల్చర్ వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

దీనికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నా.శక్తివంతమైన గన్ లాబీ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటోందన్న వాదనలు వున్నాయి.

ఇక తుపాకీ కాల్పుల్లో భారతీయులు కూడా మరణిస్తున్నారు.కాగా, సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఆగస్టు 5, 2012లో విస్కాన్సిన్ రాష్ట్రంలోని ఓక్ క్రీక్ ప్రాంతంలో ఉన్న సిక్కు ప్రార్థనా మందిరంలో ఓ శ్వేతజాతీయుడు ఉన్మాదిలా ప్రవర్తించాడు.

గురుద్వారాలో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో ఏడుగురు సిక్కులు ప్రాణాలు కోల్పోగా.

ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Telugu Federal Bureau, Gurdeepsingh, Cycle, Oak Creek, Hate, Sikhtemple, Gun-Tel

నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంఘీభావంగా ఓ భారత సంతతి సిక్కు వ్యక్తి అమెరికాలో 2,700 కిలోమీటర్ల మోటార్ సైకిల్ రైడ్‌ను చేపట్టాడు.గురుదీప్ సింగ్ సగ్గు (37) , మోటార్ సైకిల్ క్లబ్ యూఎస్ఏతో కలిసి.సిక్కుల సంస్కృతి, విశ్వాసంపై అవగాహన కల్పించేందుకు ఈ యాత్రకు పూనుకున్నట్లు లాస్ ఏంజిల్స్ టైమ్స్ నివేదించింది.

ఆగస్ట్ 5తో ఓక్ క్రీక్ గురుద్వారా వద్ద ఈ రైడ్ ముగియనుంది.షిప్పింగ్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు సగ్గు.తన గడ్డం, తలపాగా కారణంగా తీవ్రవాద గ్రూపుకు చెందినవాడంటూ ఆయన గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నాడు.తన తలపాగా కారణంగా పాఠశాలలో వేధింపులకు గురై ప్రతిరోజూ అతని పదేళ్ల కుమారుడు అకాల్ దీప్ ఇంటికి ఏడుస్తూ వచ్చేవాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

Telugu Federal Bureau, Gurdeepsingh, Cycle, Oak Creek, Hate, Sikhtemple, Gun-Tel

ఇదిలావుండగా.ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) వెల్లడించిన గణాంకాల ప్రకారం.2021లో మతానికి సంబంధించి 1005 ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయి.అయితే అత్యధికంగా లక్ష్యంగా చేసుకున్న మత సమూహాల్లో ఒకరిగా సిక్కులు నిలిచారు.2018లో ఎఫ్‌బీఐకి అందిన ఫిర్యాదుల్లో సిక్కులపై జరిగిన ద్వేషపూరిత నేరాలు 60 కాగా.2020లో ఈ సంఖ్య 89కి పెరిగింది.2021లో అత్యధికంగా 214కు చేరడం సమస్య తీవ్రతగా అద్ధం పడుతోంది.విద్వేష నేరాలకు సంబంధించి 2018లో అమెరికాలో యూదులు, ముస్లింల తర్వాత సిక్కులు వుండేవారు.

అయితే ఇప్పుడు అనూహ్యంగా సిక్కులు రెండవ స్థానంలోకి చేరారు.ఎఫ్‌బీఐ ప్రకారం.

అమెరికాలో ఇతర మతాలకు వ్యతిరేకంగా 91 ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయి.ఇందులో హిందువులపై 12, బౌద్ధులపై 10 నేరాలు జరిగాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube