తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ టిఆర్‌ఎస్ పార్టీని బిఆర్‌ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.తెలంగాణ మోడల్ అంటూ, రైతు సంక్షేమమే ధ్యేయం అనే నినాదాలతో బిఆర్‌ఎస్ ను జాతీయ స్థాయిలో విస్తరించేందుకు కేసిఆర్ వడివడిగా అడుగులేస్తున్నారు.
ఇప్పటికే బిహార్, మహారాష్ట్ర, కర్నాటక వంటి ఆయా రాష్ట్రాల్లో బిఆర్‌ఎస్ ను యాక్టివ్ చేస్తున్నారు.అయితే కేసిఆర్ ప్రధాన టార్గెట్ మాత్రం ఏపీనే అని తెలుస్తోంది.
ముఖ్యంగా పక్కా రాష్ట్రమైన ఏపీలో సత్తా చాటితే.మిగిలిన రాష్ట్రాలకు మరింత చేరువ కావొచ్చనే ఆలోచనలో బిఆర్‌ఎస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
అందుకే ఆ పార్టీ అధినేత కేసిఆర్ ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.అని సమీకరణలను దృష్టిలో ఉంచుకొని ఏపీ బిఆర్‌ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేకర్ ను నియమించారు కేసిఆర్.

ప్రస్తుతం పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళేందుకు తోట చంద్రశేఖర్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.అయితే మొదటి నుంచి కూడా బిఆర్‌ఎస్ పై ఏపీలో ఒక విమర్శ చక్కర్లు కొడుతోంది.బిఆర్‌ఎస్ పార్టీ వైసీపీకి మద్దతు ప్రకటించే అవకాశం ఉందని వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని.ఇలా రకరకాల వార్తలు వినిపించాయి.కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేనట్లే కనిపిస్తోంది.వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని వైఎస్ జగన్ ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేశారు.
దీంతో వైసీపీ బిఆర్‌ఎస్ తో కలిసే అవకాశాలు దాదాపుగా లేనట్లే.మరోవైపు బిఆర్‌ఎస్ కు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది.
తాజాగా బిఆర్‌ఎస్ నేత కేసిఆర్ కుమార్తె అయిన కల్వకుంట్ల కవిత ఏపీలో బిఆర్‌ఎస్ పొత్తులపై వివరణ ఇచ్చారు.ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కవితా మాట్లాడుతూ.
ఎవరికోసం బిఆర్‌ఎస్ పని చేయదని, ఏపీలో అయిన, యూపీలో అయిన బిఆర్‌ఎస్ ప్రధాన లక్ష్యం గెలుపే అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

తమ వ్యూహాలు అన్నీ కూడా కేవలం బిఆర్‌ఎస్ గెలుపుకోసమే ఉంటాయని తేల్చి చెప్పారు.అయితే ఏపీలో బిఆర్‌ఎస్ స్వతహాగా గెలవగలిగే బలం లేదనే సంగతి అందరికీ తెలిసిందే.దాంతో ఎన్నికల సమయానికి బిఆర్‌ఎస్ పొత్తువైపు చూసే అవకాశం లేకపోలేదు.
ఒకవేళ పొత్తులకు సై అంటే ఏ పార్టీతో బిఆర్‌ఎస్ చేతులు కలుపుతుందనేదే ఆసక్తికరం.వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని జగన్ క్లారిటీ ఇవ్వడంతో ఆ పార్టీతో దోస్తీ దాదాపుగా లేనట్లే, ఇకా టీడీపీతో కేసిఆర్ కలిసే ప్రసక్తే లేదు.
ఇక మిగిలింది జనసేన మాత్రమే.జనసేన ఇప్పటికే బిజెపి తో పొత్తులో ఉంది.
టీడీపీతో కలిసేందుకు కూడా సిద్దంగా ఉంది.ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ తో జనసేన కలుస్తుందా అనేది ప్రశ్నార్థకమే.
ఇవేవీ జరగకపోతే బిఆర్‌ఎస్ ఒంటరిగానే బరిలోకి దిగడం ఖాయం.ఏది ఏమైనప్పటికి గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతామని చెబుతున్నా బిఆర్‌ఎస్ కు ఏపీ ప్రజలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తారో చూడాలి.







