ఇలాంటి పాన్ షాప్ మీరు చూసుండరు? ఒక్కొక్కటి లక్షన్నర మరి!

అదొక పాన్ షాప్.అక్కడ పాన్ తినాలంటే అప్పు చేయాల్సిందే.

 Very Costly And 600 Varieties Of Paan Available At Mauli Family Paan House Detai-TeluguStop.com

దాని పేరు మౌలి ఫ్యామిలీ పాన్‌హౌస్. ఈ​ షాపులో దాదాపు 600 రకాల పాన్​లు అందుబాటులో ఉంటాయి.

ఈ షాప్​లో 25 రూపాయల పాన్​ నుంచి.లక్షన్నర రూపాయల ధరల వరకు పాన్​లు ప్రతిరోజూ కొలువు దీరతాయి.

ఈ షాప్ మహారాష్ట్రలోని నాశిక్​లో ఉంది.గత ఎనిమిది ఏళ్లుగా ఈ పాన్​ షాపును నిర్వహిస్తున్న గణేశ్​ దుక్రే బీఏ డిగ్రీ పూర్తి చేసిన తరువాత కొద్ది రోజులు ఉద్యోగ ప్రయత్నాలు చేసి, అదంతా వేస్ట్ అనుకొని తానే సొంతంగా వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నాడు.

అనుకున్నదే తడవుగా ఓ పాన్ షాపు ప్రారంభించాలని అనుకొని పుణె వెళ్లి ఓ పాన్​ షాప్​లో కొన్ని రోజులు పనిచేశాడు.అక్కడ వివిధ ఆకులు, పాన్​ల గురించి అవగాహన తెచ్చుకున్నాడు.అనంతరం నాసిక్​ వచ్చి వ్యాపారం ప్రారంభించాడు.స్టార్ట్ చేసిన కొద్ది రోజులలోనే ఈ పాన్‌హౌస్​కు చాలా మంది అభిమానులు అయిపోయారు.ఎంతలా అంటే నాశిక్​ వచ్చిన పర్యటకులు.కచ్చితంగా ఈ పాన్ షాపునకు వచ్చి పాన్ తినాల్సిందే.

ఈ నేపథ్యంలో ఓ కస్టమర్ స్పందిస్తూ… “చాలా సంవత్సరాలుగా నేను ఈ​ మౌలి ఫ్యామిలీ పాన్‌హౌస్​లో పాన్​ తింటున్నాను.భోజనం చేసిన తరువాత ఇక్కడ పాన్​ తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు.ఇక్కడ ఆయుర్వేదిక్​ పాన్​, మిటా పాన్​లు ఉంటాయి.నేను ఈ షాప్​లో ఉన్న చాలా పాన్​లు ట్రై చేశాను.మీరు కూడా ట్రై చేయండి” అని ఎంతో నమ్మకంగా చెప్పుకొచ్చాడు.ఇక దాని యజమాని అయినటువంటి గణేష్ మాట్లాడుతూ… “మా దగ్గర మొత్తం 600 రకాల పాన్లు రోజూ అందుబాటులో ఉంటాయి.

మగాయి పాన్, గుల్కాడ్​ పాన్​, ఫ్రూట్​ పాన్​, ఐస్​పాన్, జీలీ పాన్, ఐస్​క్రీమ్​ పాన్​ దొరుకుతాయి.లిక్విడ్​ పాన్​ల్లో పాన్​ షేక్​, పాన్​ షాటే, పాన్​ ముజిదే వంటివి ఉన్నాయి.25 రూపాయల నుంచి లక్షన్నర రూపాయల వరకు ఇక్కడ లభ్యమవుతాయి.అని చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube