రష్యా ఆర్థిక పరిస్థితిపై బిలియనీర్ సంచలన వ్యాఖ్యలు.. పొంచి ఉన్న పెను ముప్పు..

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది దాటింది.ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో ఎన్నో నగరాలు ధ్వంసం అయ్యాయి.

 Russia Likely To Run Out Of Money Billionaire Oleg Deripaska Comments Details, R-TeluguStop.com

భవనాలన్నీ నేలమట్టం అయ్యాయి.భారీగా ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడింది.

అయితే ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు సహకారాన్ని అందిస్తున్నాయి.భారీగా ఆయుధ సామగ్రిని పంపుతున్నాయి.

మరో వైపు బలమైన రష్యా భీకరంగా దాడులు చేస్తోంది.అయితే రష్యా ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోంది.

ఈ క్రమంలో రష్యాకు చెందిన ఓ బిలియనీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తమ దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, వచ్చే ఏడాదికి ఖజానా ఖాళీ అవడం ఖాయమని వెల్లడించారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.ఇటీల సైబీరియాలో పెట్టుబడుల సదస్సు జరిగింది.దీనికి రష్యాలో ఒకప్పటి అపర కుబేరుడు, రష్యన్ ఒలిగార్క్‌ ఒలెజ్ డెరిపాస్కా హాజరయ్యారు.ఉక్రెయిన్‌తో యుద్ధం వల్ల రష్యా ఎదుర్కొంటున్న పర్యవసానాలను వివరించారు.

రష్యా ఖజానా మరో ఏడాది నాటికి ఖాళీ అయిపోతుందన్నారు.మిత్ర దేశాల నుంచి స్నేహపూర్వక పెట్టుబడులు లేకుంటే ఆర్థిక పరిస్థితి కుప్పకూలడం ఖాయమన్నారు.డెరిపాస్కా భారీ వ్యాపారవేత్త.అతను రష్యాలో అత్యంత ధనవంతుడు.అతను ఎనిమిది మంది ఒలిగార్క్‌లలో ఒకరు.వీరికి వ్యతిరేకంగా UK ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం, యూరోపియన్ యూనియన్ తీవ్రమైన ఆంక్షలు జారీ చేశారు.

దీంతో ఆయన సంపద గణనీయంగా తగ్గిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube