బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరై తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది దీప్తి సునైనా.మొదట్లో దీప్తి డబ్ స్మాష్ వీడియోలు చేసిమంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
ఆ తర్వాత యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో బాగా మెప్పించింది.అలా ఆ గుర్తింపు లతో బిగ్ బాస్ లో అవకాశం అందుకోగా తన కెరీర్ మొత్తం బిగ్ బాస్ తో మొదలైందని చెప్పవచ్చు.
ఇక బిగ్ బాస్ తర్వాత పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.
మంచి సక్సెస్ లు అందుకుంది.మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.అంతేకాకుండా సింగర్ గా కూడా బాగా మెప్పించింది.
ఇక దీప్తి మరో సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ తో కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా చేసింది.ఇక వీరిద్దరూ కలిసి కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేశారు.
దీంతో వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ ఏర్పడింది.కొంతకాలం వరకు వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ లా ఉన్నట్లు అందరినీ నమ్మించారు.
కానీ బిగ్ బాస్ సీజన్ 5 తో నిజమైంది.అందులో షన్ను పాల్గొనగా ఆ సమయంలో తమ ప్రేమ బయటపడింది.ఇక పలు బుల్లితెర షో లలో కూడా వీరిద్దరు జంటగా పాల్గొని బాగా రచ్చరచ్చ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.అయితే బిగ్ బాస్ లో షన్ను ప్రవర్తనలో మార్పు రావడంతో నెగిటివిటిని మూటగట్టుకున్నాడు.
దీంతో దీప్తి.షన్ను తో తన రిలేషన్ కరెక్ట్ కాదని బ్రేకప్ చెప్పుకుంది.
ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.ఇక ఆరోజు నుంచి దీప్తి బాగా ఎమోషనల్ గా ఉంటుంది.
సోషల్ మీడియా వేదికగానే తాను రిఫ్రెష్ అయ్యింది.ఇక అప్పటినుంచి సోషల్ మీడియా నిత్యం బాగా ఫోటోలు బాగా పంచుకుంటుంది.
అంతేకాకుండా బాగా ఫోటో షూట్ లు చేయించుకొంటూ బాగా షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.అంతే కాకుండా పలు ఆల్బమ్స్ కూడా చేస్తూ మంచి సక్సెస్ లు అందుకుంది.
ఇటీవలే సొంతంగా ఒక ఇల్లును కూడా కొనుగోలు చేసింది.మొత్తానికి బ్రేకప్ తర్వాత బాగా యాక్టివ్ గా మారింది దీప్తి.
ఫ్రెండ్స్ తో కలిసి బాగా ట్రిప్స్ అంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను కొన్ని ఫొటోస్ పంచుకుంది.అందులో తను పొట్టి నిక్కర్ వేసుకొని.పెయింటింగ్ వేస్తున్నట్లుగా షో చేసింది.
అయితే ఎక్కడ కూడా ఆమె పెయింటింగ్ వేసినట్లుగా కనిపించకపోగా అందులో ఆ రంగులన్నీ తన ముఖానికి, తన శరీరానికి అంటించుకున్నట్లు కనిపించింది.తన థైస్ అందాలు కూడా బయటపడ్డాయి.
దీంతో ఆ ఫోటోలు బాగా వైరల్ అవ్వగా ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.పెయింటింగ్ తప్ప అన్ని చూపించేస్తున్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.