ఇపుడు ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు అందులో నామినీ తప్పనిసరిగా ఉండాలనే విషయాన్ని ఖచ్చితం చేసింది.బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే అప్లికేషన్ ఫామ్‌లో నామినీ పేరు రాసే ఆప్షన్ అనేది ఉంటుంది.
ఆ సమయంలో నామినీ పేరు రాయనివాళ్లు తర్వాత నామినేషన్ ఫెసిలిటీ ఉపయోగించుకొని నామినీ పేరుని అప్డేట్ చేసుకొనే వీలుంది.ఒకవేళ నామినీ పేరు మార్చాలనుకున్నా కూడా దానికి కూడా ఇక్కడ వెసులుబాటు వుంది.
ఎస్‌బీఐ ఇపుడు మూడు పద్ధతుల్లో నామినీ పేరు అప్‌డేట్ చేసే సదుపాయాన్ని మీకు కల్పిస్తోంది.ఆన్‌లైన్‌లో కూడా నామినీ పేరు అప్‌డేట్ చేసుకోవచ్చనే విషయాన్ని గుర్తు చేస్తోంది.
బ్యాంక్ అకౌంట్, డిపాజిట్ అకౌంట్ వాటి కోసం నామినీ పేరు అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.ఈ విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని నిపుణులు చెబుతున్నారు.ఇకపోతే ఇన్స్యూరెన్స్ పాలసీకి నామినీ పేరు తప్పనిసరి ఎందుకంటే, పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే, పాలసీ బెనిఫిట్స్ నామినీకి అందాలి కదా.అలాగే బ్యాంక్ అకౌంట్లు, డిపాజిట్ అకౌంట్లలోని డబ్బుల్ని తమ తదనంతరం ఎవరికి చెందాలో బ్యాంకుకు చెప్పేందుకు నామినీ పేరుని అప్డేట్ చేయాల్సి ఉంటుంది.ఇకపోతే ఇండివిజువల్ అకౌంట్స్, జాయింట్ అకౌంట్లకు మాత్రమే నామినేషన్ సదుపాయం ఉంటుంది.ఒకసారి నామినీ పేరు అప్‌డేట్ చేసిన తర్వాత ఎప్పుడైనా పేరు మార్చవచ్చు.లేదా తొలగించవచ్చు.
ఇపుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా నామినీ పేరుని అప్డేట్ చేయడం చాలా తేలిక.దానికోసం మీ ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో మొదట లాగిన్ కావాలి.తరువాత రిక్వెస్ట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఆ తరువాత ఆన్లైన్ నామినేషన్ పైన క్లిక్ చేసి, అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి.ఇపుడు నామినీ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
అదే విధంగా యోనో ఎస్‌బీఐ యాప్ ద్వారా కూడా నామినీ పేరు అప్డేట్ చేసుకోవచ్చు.దీనికోసం ముందుగా యాప్‌లో లాగిన్ అయ్యి సర్వీసెస్ మరియు రిక్వెస్ట్ పైన క్లిక్ చేయాలి.
ఆ తరువాత పైన చెప్పిన మాదిరిగానే ప్రాసెస్ మొత్తం పూర్తి చేయాల్సి ఉంటుంది.