ఈ ఏడాదిలో మూడు సినిమాలు... దసరా తర్వాత కుమ్మేసుడే అంటున్న నాని

నేచురల్ స్టార్ నాని ఈనెల చివర్లో దసరా సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.నాని ఆ మధ్య మాట్లాడుతూ దసరా సినిమా పై అంచనాలు భారీగా పెంచే విధంగా వ్యాఖ్యలు చేశాడు.

 Nani Three Movies In This Year Details, Ante Sundaraniki, Dasara Movie, Hero Nan-TeluguStop.com

గత సంవత్సరం వచ్చిన భారీ చిత్రాలు ఎలాగైతే ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచి పోతాయో అలాగే దసరా సినిమా కూడా 2023 లో వచ్చిన గొప్ప చిత్రాల జాబితా లో నిలిచి పోతుంది అనే ధీమాని వ్యక్తం చేశాడు.దసరా సినిమా షూటింగ్ పూర్తి కాక ముందే మరో సినిమా ని కూడా నాని ప్రకటించిన విషయం తెలిసిందే.

సీతారామం హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్ ఆ సినిమా లో హీరోయిన్ గా కనిపించబోతోంది.

ఈ రెండు సినిమాలు కాకుండా అంటే సుందరానికి సినిమా తో మంచి పేరు సొంతం చేసుకున్న వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం లో కూడా నాని మరో సినిమా ను చేసేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది.ఆ సినిమా కూడా ఈ సమ్మర్ లోనే ప్రారంభం కాబోతుందని ప్రచారం జరుగుతుంది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ మూడు సినిమాలు కూడా 2023 సంవత్సరం లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఈ నెల చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దసరా సూపర్ హిట్ అయితే ఆ తర్వాత సినిమాలను స్పీడ్‌ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.కనుక నాని దసరా సినిమా ఫలితం పై ఆయన సినిమా ల యొక్క చాలా భవిష్యత్తు ఆధారపడి ఉందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.సోషల్ మీడియా లో దసరా సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది.నాని సినిమా కి ఎప్పుడు లేనంత హైప్‌ క్రియేట్ అయింది.భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube