వావ్‌ అద్భుతం... అమెరికాలో తరహాలో హైదరాబాద్‌ లో ఆ తరహా థియేటర్‌

అమెరికా స్థాయిలో మన హైదరాబాద్ కూడా అభివృద్ధి చెందుతుంది అనేందుకు మరో ప్రత్యక్ష ఉదాహరణ డ్రైవ్ ఇన్‌ థియేటర్. అమెరికా తో పాటు చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ తరహా థియేటర్స్ ఉన్నాయి.

 Drive In Movie Theater In Hyderabad Very Soon Details, Drive In Theater, Hyderab-TeluguStop.com

ఇండియా లో కూడా ఈ తరహా థియేటర్స్ ని ప్రారంభించారు.కానీ ఎక్కువ ఆదరణ లేదు.

అయితే శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్ సమీపం లో డ్రైవ్‌ ఇన్‌ థియేటర్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్ చైన్ ని కలిగి ఉన్న ఏషియన్ సినిమాస్ వారు ఈ డ్రైవ్‌ ఇన్‌ థియేటర్స్ ని ఏర్పాటు చేయబోతున్నారని సమాచారం అందుతుంది.

వందల కొద్ది కార్లు పార్కింగ్ చేసే విధంగా ఒక అతి పెద్ద ప్లేస్ ని ఇప్పటికే గుర్తించారని, అందులో ఈ థియేటర్ ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ మధ్య కాలం లో హైదరాబాద్ సెలబ్రెటీలు మరియు డబ్బున్న వారు ఇలాంటి డ్రైవ్‌ ఇన్‌ థియేటర్స్ ల కోసం బాగా డిమాండ్ చేస్తున్నారు.అందుకే ఈ తరహా థియేటర్ ని ఏర్పాటు చేసేందుకు ఏషియన్స్ సినిమాస్‌ వారు ముందుకు వచ్చారని సమాచారం అందుతుంది.కాస్త ఖర్చు ఎక్కువ అయినా కూడా కచ్చితంగా లాభాలు వచ్చే థియేటర్ అవుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారట.

అందుకే ఏషియన్స్ సినిమాస్‌ వారు కాస్త భారీ బడ్జెట్ తోనే ఈ థియేటర్ ని నిర్మించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం అందుతుంది.

హైదరాబాదులో అత్యాధునిక డ్రైవ్‌ ఇన్‌ థియేటర్ అందుబాటులోకి వస్తే స్టార్స్ మరియు సెలబ్రిటీలు రెగ్యులర్ గా సరదాగా అయినా వెళ్లి సినిమాలను ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుందని సోషల్ మీడియా ద్వారా కొందరు కామెంట్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ తరహా థియేటర్లు బెంగళూరు.ముంబయి ల్లో ఉన్నాయి.అక్కడి వారిని అలరిస్తూ ఉన్నాయి.త్వరలో హైదరాబాద్ లో అంతకు మించిన వినోదాల విందును అందించేందుకు డ్రైవ్ ఇన్ థియేటర్ రెడీ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube