వచ్చే ఎన్నికలలో పోటీ విషయంలో రేణుక చౌదరి సంచలన వ్యాఖ్యలు..!!

కాంగ్రెస్ పార్టీ కీలక నేత మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

 Sensational Comments Of Renuka Chowdhary About Contesting In The Next Elections-TeluguStop.com

అయితే ఎక్కడి నుంచి పోటీ చేయాలో అధిష్టానం నిర్ణయిస్తుంది.చాలామంది సన్నిహితులు.

శ్రేయోభిలాషులు, ప్రజలు గుడివాడ నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారు.కానీ పోటీకి సంబంధించి పార్టీ అధిష్టానం నిర్ణయమే తన నిర్ణయం అని రేణుక చౌదరి క్లారిటీ ఇచ్చారు.

విజయవాడ పార్లమెంటు నుంచి అయినా అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తానని తెలిపారు.

ఇక ఇదే సమయంలో అమరావతి రైతుల ఉద్యమంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్నో రోజుల నుండి అమరావతి రైతులు క్రమశిక్షణగా ఉద్యమాలు చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఏ క్షణంలో అయినా అమరావతి రైతులు పిలిస్తే తాను కూడా వస్తానని మాట ఇచ్చారు.

రోజుకో స్కీమ్ అంటూ బంగారం లాంటి రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube