షియోమీ కంపెనీ వైర్ లెస్ AR గ్లాస్ డిస్కవరీ ఎడిషన్ యొక్క ప్రోటో టైప్ ను, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఇటీవలే ప్రదర్శించింది.వైర్లెస్ అగ్మెంటెడ్ రియాల్టీ గ్లాసెస్ తేలికగా ఉంటు, రెటీనా- స్థాయి డిస్ప్లే తో దీని హెడ్ సెట్ స్నాప్ డ్రాగన్ *R2 జెన్ 1 చిప్ సెట్ ద్వారా పనిచేస్తుంది.
దీనిని సులభంగా మొబైల్ కు కనెక్ట్ చేయవచ్చు.

ఈ హెడ్ సెట్ బరువు కేవలం 126 గ్రాములు.ఇందులో కార్బన్ ఫైబర్, మెగ్నీషియం టైటానియం మిశ్రమం తో తయారు చేయడం జరిగింది.ఇందులో కస్టమ్ సిలికాన్ ఆక్సిజన్ బ్యాటరీ అమర్చబడి ఉంటుంది.
దీని డిస్ప్లే స్పష్టమైన చిత్రం కోసం లైట్ గైడింగ్ ప్రిజమ్ ల కి కనెక్ట్ చేయబడి, ఒక జత మైక్రో OLED స్క్రీన్ లను కలిగి ఉంది.ఇందులో ఉండే పారదర్శక మోడ్ రియల్ మరియు వర్చువల్ ఎలిమెంట్లను కలిపి చూపిస్తుంది.

యూట్యూబ్, టిక్ టాక్ వీడియోలు చూడడానికి ఇందులో ఎంఐ షేర్ యాప్ ని ఉపయోగించే అవకాశం ఉంటుంది.ఇందులో ఇంటర్ఫేస్ చుట్టూ నావిగేట్ చేయడానికి స్క్రీన్ చేరుకోవడానికి వీలు ఉంటుంది.ఇందులో 1200 నిట్ ల గరిష్ట ప్రకాశానికి మద్దతు ఇస్తుంది.ఇది అదనంగా ఇమ్మర్శన్ కోసం బ్లాక్ అవుట్ మోడ్ కలిగి ఉంది.అయితే ఇంత అద్భుత టెక్నాలజీతో తయారవుతున్న ఈ గ్లాసెస్ మార్కెట్లోకి ఎప్పుడు విడుదల అవుతుందనేది కంపెనీ ప్రకటించలేదు.కానీ మార్కెట్లోకి తీసుకోవడానికి డెవలపర్లతో కలిసి కంపెనీ పనులు వేగవంతం చేసింది.
వాస్తవ ప్రపంచంలో దీని ఫీచర్స్ ఎలా పనిచేస్తాయో ఇంకొంతకాలం వేచి చూడక తప్పదు.








