సౌత్ సినిమాలపై వివాదాస్పద వాఖ్యలు చేసిన నటుడు.. లాజిక్ ఉండదంటూ?

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలతో పాటు దేశవ్యాప్తంగా సౌత్ సినిమాల గురించి మాట్లాడుకుంటున్న విషయం తెలిసిందే.బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు స్టార్ సెలబ్రెటీలు సైతం సౌత్ సినిమాలపై డైరెక్టర్లు హీరోలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

 Naseeruddin Shah Controversial Comments On South Movies Details, Naseeruddin Sha-TeluguStop.com

ఈ మధ్యకాలంలో సౌత్ నుంచి ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు వస్తుండడంతో భాషా బేధాలు కూడా తొలగిపోతున్నాయి.కానీకొందరు బాలీవుడ్ నటులు దక్షణాది చిత్ర పరిశ్రమను చూసి కుళ్ళు కుంటున్నారు.

కావాలనే నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ సీనియర్ నటుడు నజీరుద్దీన్ షా తాజాగా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వివాదంగా మారాయి.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నజీరుద్దీన్ షా సౌత్ సినిమాల గురించి మాట్లాడుతూ.సౌత్ చిత్రాల్లో కనీసం లాజిక్ ఉండదు అంటూ నజీరుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాలలో లాజిక్ ఉండదని ఆ చిత్రాలు హిట్ అయినప్పటికీ లాజిక్ లెస్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి.కొన్ని సన్నివేశాలు ఊహకి అందని విధంగా రూపొందిస్తారు.

Telugu Bollywood, Controversial, Naseeruddinshah, Pushpa, Vikram-Movie

వాటికి తోడు పిచ్చి పిచ్చిగా పాటలు పెడతారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు నజీరుద్దీన్ షా.సౌత్ సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సృష్టించవచ్చు కానీ ఆ సినిమాలలో లాజిక్ పాటించరు అంటూ కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా కామెంట్స్ చేశారు.

Telugu Bollywood, Controversial, Naseeruddinshah, Pushpa, Vikram-Movie

ఇటీవల హిందీ చిత్రాల కంటే సౌత్ చిత్రాలే ఎక్కువగా ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి అనే విషయాన్ని మాత్రం నజీరుద్దీన్ అంగీకరించారు.అయితే నజీరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం నెటిజన్లు మండిపడుతున్నారు.ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2, పుష్ప, విక్రమ్ లాంటి అద్భుతమైన చిత్రాలు నజీరుద్దీన్ కి కనిపించడం లేదా అని నెటిజన్ లు మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube