అధిక జీబీ ర్యామ్ ఉంటే ఫోన్లు చాలా స్పీడ్‌గా పని చేస్తాయి.దీంతో మార్కెట్‌లో అధిక జీబీ ర్యామ్ ఉండే ఫోన్లకు ఎక్కువ డిమాండ్ ఉంటోంది.
అందులోనూ ప్రస్తుతం 6జీబీ ర్యామ్‌తో వచ్చే 5జీ ఫోన్లను అందరూ ఎక్కువగా కొంటున్నారు.ఇక బడ్జెట్‌లో మార్కెట్‌లో అందరికీ అందుబాటులో ఉండే ఫోన్ల గురించి అంతా ఆరా తీస్తున్నారు.
ఇటువంటి తరుణంలో వివో Y100 5జీ, వన్ ప్లస్ 11 5జీ బెస్ట్ ఆప్షన్లుగా చెప్పొచ్చు.వీటి ధర, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.

వివో Y100 5జీ విషయాని కొస్తే దీని ప్రారంభ ధర రూ.24,999గా ఉంది.ఇది మెటల్ బ్లాక్, పసిఫిక్ బ్లూ, ట్విలైట్ గోల్డ్ వంటి విభిన్న రంగులలో లబిస్తోంది.181 గ్రాముల బరువు ఉంటుంది.ఇది 6.38 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.దీనికి 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది.ఆక్టా కోర్ (2.4 GHz, డ్యూయల్ కోర్, కార్టెక్స్ A78 + 2 GHz, హెక్సా కోర్, కార్టెక్స్ A55) మీడియా టెక్ డైమెన్సిటీ 900 MT6877తో అమర్చబడి ఉంది.ఈ ఫోన్ 8 జీబీ, లేదా 6జీబీ ర్యామ్‌తో పాటు 128 జీబీ ఇంటర్నల్ మెమొరీతో ఉంటుంది.
ఇందులో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు.ఈ ఫోన్‌కు వెనుక వైపు 64 MP + 2 MP + 2 MP కెమెరాలు ఉన్నాయి.

ముందు భాగంలో 16 MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.ఇక వన్ ప్లస్ 11 5జీ ఫోన్ గురించి పరిశీలిస్తే స్నాప్‌డ్రాగన్ మొదటి 8 Gen 2 ప్రాసెసర్‌తో రూపొందించారు.ఇది 6.70 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది.1440×3216 పిక్సెల్‌ల (QHD+) రిజల్యూషన్‌ను అందిస్తుంది.డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్‌ని ఉంచారు.
ఇది 8 జీబీ ర్యామ్, 16 జీబీ ర్యామ్‌లతో వస్తుంది.ఇందులో 5000 ఎంఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ అమర్చారు.
ఈ ఫోన్ సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.కెమెరాల విషయానికొస్తే, వెనుకవైపు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉన్న ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.
సెల్ఫీల కోసం 16 ఎంపీ సింగిల్ ఫ్రంట్ కెమెరా ఉంది.దీని ప్రారంభ ధర రూ.56,999గా నిర్ణయించారు.







