వి వి వినాయక్ నెక్స్ట్ సినిమా ఏంటంటే..?

ఎన్టీయార్ తో ఆది సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వి వి వినాయక్ ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న టాప్ హీరోలందరితో సినిమాలు చేశారు చిరంజీవి లాంటి హీరోతో రెండు సినిమాలు చేసి రెండు బ్లాక్ బస్టర్స్ కొట్టారు…

 What Is Vv Vinayak Next Movie V V Vinayak, Chiranjeevi , Bollywood, Tollywood,-TeluguStop.com
Telugu Aadi, Bellamkondasai, Bollywood, Chatrapathi, Chiranjeevi, Tollywood-Late

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేసి బాంబులు పెట్టీ సుమోలని గాల్లోకి లేపిన మొదటి డైరెక్టర్ వినాయక్ అనే చెప్పాలి.ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక ఎపిసోడ్ అయితే చాలా వైలెంట్ గా ఉంటుంది అలాగే హీరో ఎలివేషన్స్ ని పీక్ స్టేజ్ లో చూపిస్తాడు అందుకే ఆయన కి మాస్ ఆడియెన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది…

Telugu Aadi, Bellamkondasai, Bollywood, Chatrapathi, Chiranjeevi, Tollywood-Late

ఒకసారి వినాయక్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే చూడాలి అని చాలా మంది వినాయక్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి, ప్రస్తుతం ఆయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని హీరోగా పెట్టీ ఛత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు ఈ సినిమా కనక హిందీలో హిట్ అయితే వినాయక్ గారికి హిందీ లో పెద్ద హీరోల సినిమాలు చేసే ఛాన్స్ కూడా వస్తుంది.తను కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడు.ఇక ఈ సినిమా తర్వాత వినాయక్ మళ్ళీ చిరంజీవి తో సిన్మా చేసే అవకాశం కూడా ఉంది అని ఆయన సన్నిహితుల నుంచి సమాచారం అందుతుంది.చూడాలి మరి వినాయక్ నెక్స్ట్ సినిమా బాలీవుడ్ హీరోలతో ఉంటుందా లేక తెలుగులో చిరంజీవి తో ఉంటుందా లేక ఇంకా ఇతర హీరోలతో ఉంటుందా అనేది వేచి చూడాల్సిందే…

 What Is VV Vinayak Next Movie V V Vinayak, Chiranjeevi , Bollywood, Tollywood,-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube