అవును, మీరు విన్నది నిజమే.అయితే ఈ ప్రతిపాదన కొన్నాళ్ల క్రితమే వచ్చింది.
కాగా దీనిపైన కేంద్రం ఇప్పుడు ఫోకస్ పెట్టినట్టు కనబడుతోంది.విషయం ఏమంటే, వృథాగా ఉన్న రైలు బోగీలను హోటళ్లుగా మార్చేందుకు దక్షిణ రైల్వే ప్రణాళిక రచిస్తోంది.
ఈ నేపథ్యంలో మొదటి దశలో 3 చోట్ల ట్రైన్ హోటళ్లను ఏర్పాటు చేయనుంది.దక్షిణ రైల్వే పరిధిలోని చెన్నై సెంట్రల్ స్టేషన్ కి రోజూ లక్షల్లో ప్రయాణికులు వచ్చి వెళుతూ వుంటారు.
ఇక్కడ సరైన హోటళ్లు అందుబాటులో లేవని ప్రయాణికులు ఎప్పటినుండో బాధపడుతున్నారు.ఇక వారి బాధలు తీరిపోయినట్టే.

ప్రయాణికుల బాధలను పరిగణనలోకి తీసుకున్న దక్షిణ రైల్వే ప్రయాణికులను ఆకర్షించే విధంగా వృథాగా ఉన్న బోగీల్లో హోటళ్ల ఏర్పాటపై ఇపుడు దృష్టి సారించింది.ఈ హోటళ్ల నిర్వహణ ప్రైవేటు సిబ్బందికి అప్పగించబోతోంది.ఐతే దాని ద్వారా దక్షిణ రైల్వేకు అదనపు ఆదాయం చేకూరనుంది.కాగా రైల్వే యంత్రాంగం నిజమైన రైలు బోగీలను హోటళ్లుగా మార్చనుండడం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారనుంది.
రైలులో ప్రయాణిస్తూ ఆహారాన్ని తింటున్నామనే అనుభూతిని కలిగించేలా.ఆయా బోగీలలో ప్రత్యేక డిజైన్లు, సీట్లను ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేయనున్నారు.

ఇకపోతే ప్రైవేట్ సంస్థలకు టెండర్ల ద్వారా ఈ హోటళ్లను కేటాయించనున్నారు.24 గంటల పాటూ ఇవి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని మెరుగైన సేవలను అందించే విధంగా ఉంటాయి.దానికోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయనున్నారు.ఒకే సమయంలో ఓ బోగీలో 40 మంది కూర్చుని ఆహారం తినేందుకు తగినట్లు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.తొలి విడతలో చెన్నై సెంట్రల్, పెరంబూరు, కాటాన్ కొళ్తూరు స్టేషన్లలో ఈ రైలు బోగీల హోటళ్లకు ఆన్లైన్ ద్వారా టెండర్లను ఆహ్వానించనున్నారు.







