ఒకప్పుడు యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోయిన్స్ లో రాశి ఒకరు…అప్పట్లో ఆమె చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకునేవి.పవన్ కళ్యాణ్ తో గోకులంలో సీత అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు అలాగే జగపతి బాబు తో శుభాకాంక్షలు, పెళ్లి పందిరి, శ్రీకాంత్ తో ప్రేయసి రావే లాంటి చాలా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించారు ఆ టైమ్ లో ఆమె హీరోయిన్ గా చాలా బిజీగా గడిపేవారు.

అలా చాలా రోజుల పాటు ఇండస్ట్రీ లో హీరోయిన్ గా కొనసాగిన ఆవిడ హీరోయిన్ గా కెరియర్ ముగిసిన తర్వాత వెంకీ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కూడా చేశారు అలాగే డైరెక్టర్ తేజ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వచ్చిన నిజం సినిమా లో విలన్ అయిన గోపిచంద్ పక్కన ఆయన కీపు గా నటించారు.ఈ క్యారెక్టర్ లో చేసిన ఆమెకి జనాల నుంచి చాలా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.ఆ క్యారెక్టర్ లో రాశి ని చూసిన వాళ్ళు అప్పట్లో మంచి హీరోయిన్ గా చేసిన రాశి ఈవిడేనా అని ఒక్కసారి గా డౌట్ పడ్డారు… అలా ఆవిడకి ఆ సినిమా చాలా మైనస్ అయింది.అయితే ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న రాశి ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ డైరెక్టర్ తేజ నాకు ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుందని చెప్పలేదు రౌడీ భార్య గా చేయాలి అంటే నేను ఒప్పుకున్న తీరా టైం కి నాకు ఈ క్యారెక్టర్ చెబితే నేను చేయలేను అని చెప్పాను.
అప్పుడు తేజ ఉండి లేదు మీరు చేయాలి ఎందుకంటే ఇప్పుడు మీరు చేయకపోతే మా షూట్ ఆగిపోతుంది అని చెప్పారట ఎంత చెప్పినా మూవీ టీమ్ వినిపించుకోలేదట.

దాంతో తప్పక ఆ క్యారెక్టర్ చేశాను అని చెప్తూ ఆ రకం గా క్యారెక్టర్ గురించి ముందే పూర్తిగా చెప్పక తేజ గారు నన్ను మోసం చేశారు అంటూ చెప్పారు.ఇలాంటి క్యారెక్టర్ చేసినందుకు తనను అభిమానించే ఫ్యాన్స్ కి సారీ కూడా చెప్పారు.ఇక అప్పటి నుంచి ఏదైనా సినిమా చేయాలంటే ముందు తన క్యారెక్టర్ డీటైల్స్ ఫుల్ గా తెలుసుకున్నాకే చేస్తున్నాను అని చెప్పారు…
.







