డైరెక్టర్ వెంకీ కుడుముల గురించి అందరికీ తెలుసు నాగ శౌర్య తో ఛలో అనే సినిమాని తెరకెక్కించి మంచి హిట్ అందుకున్నాడు.అయితే వెంకీ కి నాగ శౌర్య కి ఈ సినిమా టైం లో కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగాయట దాంతో వాళ్లిద్దరి మధ్య మాటలు లేకుండా పోయాయి.
వీళ్ళ మధ్య గొడవకి అసలు కారణం ఎంటి అంటే ఛలో కథ విషయం లో కథ నేను రాశాను అని వెంకీ, లేదు అది నా కథ అని నాగ శౌర్య ఇలా ఇద్దరు కూడా చాలా గొడవలు పెట్టుకున్నారట దాంతో ఇద్దరి మధ్య మాటలు లేకుండా పోయాయి.కానీ ఛలో సినిమా మాత్రం మంచి సక్సెస్ ని అందుకుంది.
వెంకీ ఆ సినిమా తర్వాత నితిన్ తో భీష్మ అనే సినిమా తీసి హిట్ కొట్టాడు.

నాగశౌర్య మాత్రం ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నాడు.నాగ శౌర్య ఊహలు గుసగుసలాడే అనే సినిమా తో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా తోనే మంచి హిట్ అందుకున్నాడు ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఛలో మూవీ వచ్చేదాకా ఆయనకి సరైన సక్సెస్ అయితే దక్కలేదు.ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తూ ఒక్క హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు…

అలాగే వెంకీ కూడా నితిన్ తో హిట్టు కొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చేసే సినిమా పెద్ద హీరోతో చేయాలనే ఆలోచనలో ఉన్నాడు…చిరంజీవితో కూడా సినిమా చేసే ఛాన్స్ ఉంది అంటూ అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ అవి నిజమో కాదో అనే విషయం తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు ఆగాలి…
.







