కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ జోసెఫ్ ఒకరు.ఈయన తమిళ్ లో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.
ఇక తెలుగులో కూడా ఒక మాదిరిగా మార్కెట్ అయితే క్రియేట్ అయ్యింది.ఇటీవలే వచ్చిన వారసుడు సినిమా తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయినప్పటికీ తెలుగులో మాత్రం యావరేజ్ గా నిలిచింది.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇదే జోష్ తో వెంటనే తన 67వ సినిమాను కూడా స్టార్ట్ చేసాడు.
మాస్టర్ వంటి సినిమాను తెరకెక్కించి విజయ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ తో విజయ్ దళపతి 67వ సినిమా ”లియో” తెరకెక్కుతుంది.
ఇక ఈ సినిమా గత కొన్ని రోజుల క్రితమే గ్రాండ్ గా చెన్నైలో స్టార్ట్ చేసారు.ఈ సినిమాలో విజయ్ కు జోడీగా త్రిష నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
అలాగే సంజయ్ దత్ విలన్ రోల్ ప్లే చెయ్యనున్నారు.

అలా సినిమా లాంఛ్ చేయగానే ఇలా షూట్ కూడా స్టార్ట్ చేసాడు లోకేష్.ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో జరుగుతుంది.శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను వచ్చే దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్టు కన్ఫర్మ్ చేసారు.
మరి ఈ క్రమంలోనే లోకేష్ పక్కా ప్లానింగ్ తో ఈ సినిమా షూట్ ను ముగిస్తున్నాడని సమాచారం.ఈ సినిమా షూట్ ఎప్పటికి పూర్తి చేయాలి? పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎప్పుడు స్టార్ట్ చేయాలి? అనే దానిపై పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి పెట్టుకున్నాడట.

లోకేష్ ఈ సినిమా షూటింగ్ ను మే నాటికి పూర్తి చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు నెక్స్ట్ ప్రమోషన్స్ కోసం అన్ని పక్కాగా ప్లాన్ చేసి పెట్టుకున్నాడట.దీంతో ఈ సినిమా దసరాకి కన్ఫర్మ్ గా రిలీజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఇక సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.







