విరాట్ కోహ్లీ కొత్తగా ముంబైలోని ఆలీబాగ్ లో ఇంద్ర భవనం లాంటి బంగ్లా ను ఇటీవలే కొనుగోలు చేశాడు.ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో టీమిండియా 2-0 ఆధిక్యం లో ఉన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరిగే మూడో మ్యాచ్ కు సిద్ధమవుతున్న క్రమంలో, ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలను అతని అన్నయ్య వికాస్ కోహ్లీ పూర్తి చేశారు.
రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ బంగ్లా దాదాపు 100 కార్ల ధరకు సమానం.ఈ బంగ్లా ఖరీదు ఆరు కోట్లు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.కేవలం ఈ ఇంటి కోసం స్టాంప్ డ్యూటీ గా రూ.36 లక్షలు కోహ్లీ చెల్లించినట్లు తెలుస్తుంది.ఈ బంగ్లాలో 400 చదరపు అడుగుల స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది.అంతేకాదు విరాట్ కు 20 కోట్ల విలువైన ఫామ్ హౌస్ కూడా ఉంది.
2022 సెప్టెంబర్ లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మతో కలిసి 36,059 చదరపు అడుగుల ఫామ్ హౌస్ ను కొనుగోలు చేశాడు.దీనికోసం 1.5 కోట్ల స్టాంపు డ్యూటీ కూడా చెల్లించారని వార్తలు వినిపించాయి.ఇక భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కు ఆలీ బాగ్ లో ఆస్తులు ఉన్నాయి.
2021లో మత్రోలి గ్రామంలో నాలుగు ఎకరాల భూమిని రోహిత్ శర్మ కొనుగోలు చేశాడు.ఆలీ బాగ్ అంటే ముంబైలోని లగ్జరీ ప్లేస్ లలో ఒకటి.ఈ ప్రాంతంలో ఒక స్వేర్ ఫీట్ ధర 3000 నుండి 3,500 వరకు ఉంటుంది.ఈ ప్రాంతాన్ని సెలబ్రిటీస్ కు బెస్ట్ వీకెండ్ డెస్టినేషన్ గా కూడా చెప్పవచ్చు.
ఇక్కడ ఉండే బంగ్లాలు అన్ని సెలబ్రిటీస్ కు చెందినవే.