నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా దశాబ్ద కాలంగా భూకంప తరంగాలు, భూమి ఇన్నర్ కోర్ గుండా ఎంత వేగంగా దూసుకుపోతాయో తెలుసుకోవడానికి లోతుగా పరిశోధనలు చేస్తోంది.దీనికోసం రిక్టర్ స్కేల్ పై ఆరుకు పైగా తీవ్రతతో కూడిన 200 పైగా భూకంప ప్రాంతాలను లోతుగా విశ్లేషించడం ద్వారా కొత్త విషయాలు వెలుగు చూశాయి.
ఈ ప్రయోగాల ద్వారా భూకంప తరంగాలు భూమి కేంద్రకం గుండా నేరుగా దూసుకుపోతాయని అంచనా వేశారు.భూమి లోపల ఘణాకృతి లో లోహపు గోళం రూపంలో భూమికి ఐదవ పొర ఉందని వీరి అధ్యయనాలు చెబుతున్నాయి.
దీనిపై ప్రయోగాలు మరింత లోతుగా చేస్తే భూ కేంద్రకానికి సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు.
వీరి అధ్యయనాల సమాచారం అంతా జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్ తో ప్రచురించారు.
మొన్నటిదాకా భూమికి క్రస్ట్, మాంటెల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్ అనే నాలుగు పొరలు ఉండేవి.బహుశా ఇన్నర్ కోర్ లోలోతుల్లో ఒక లోహపు గోళం ఉండవచ్చని రీసెర్చ్ స్కూల్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ లో పనిచేస్తున్న డాక్టర్ థాన్సన్ వివరించారు.
కానీ 20 సంవత్సరాల కిందటనే సైంటిస్టులు భూమి లోపల చాలా లోతులో ఒక లోహపు గోళం ఉందని అంచనా వేశారు.

ఇంకా వీరి అధ్యయనాల ద్వారా భూకంపం వచ్చినప్పుడు దాని తరంగాలు భూ కేంద్రకం గుండా భూమి అవతలి వైపు దూసుకెళ్లి, తిరిగి భూకంప కేంద్రం వద్దకు ప్రయాణిస్తాయని తేలింది.అలస్కాలో భూకంపం సంభవించినప్పుడు పరిశోధకుల బృందం లోతుగా అధ్యయనం చేసి, తరంగాలు దక్షిణ అట్లాంటిక్ మహా సముద్రం గుండా భూమి అవతలికి చొచ్చుకొని పోయి తిరిగి అలస్కాలోని భూకంప కేంద్రం వద్దకు చేరుకున్నాయి.

దీనిని లోతుగా పరిశీలించే క్రమంలో ఇన్నర్ కోర్ లో లోహపు పొర ఉందని పరిశోధక బృందం తాజాగా వెల్లడించింది.ఈ లోహపు గోళం ఇనుము-నికెల్ లోహ మిశ్రమంతో కూడిన ఐదో పొర అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.భూమి లోపల ఐదవ పొరగా చెప్పుకునే లోహపు గోళం ఘణాకృతిలో ఉండడానికి భూమి ఆవిర్భావ సమయంలో జరిగిన పరిమాణాలు అయి ఉండొచ్చు అని భావిస్తున్నారు.
అనిసోట్రోపీ ఆధారంగా తరంగాలు ఏ విధంగా దూసుకెళ్తాయో, భూ కేంద్ర సమీపంలో భిన్న కోణాల్లో పదేపదే ఎలా స్పృశించాయో నిర్ధారించారు.







