తమిళ్ స్టార్ హీరో ఎంజిఆర్ తో వరసగా పదహార సినిమాలు నిర్మించిన ఏకైక నిర్మాత శాండో MM చిన్నప్ప దేవర్. ఇతని జీవిత చరిత్ర తెలిస్తే ప్రతి ఒక్కరికి ఆశ్చర్య కలగకుండా ఉండలేరు.
కేవలం 5వ తరగతి వరకు మాత్రమే చదువుకుని ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే చదువు ఆపేసి తొమ్మిది రూపాయల కోసం హమాలి కూలిగా మారి సినిమా అంటే పిచ్చితో మద్రాసు చేరుకున్నాడు చిన్నప్ప దేవర్.తమిళ సినిమాల్లో మొదట్లో చిన్న చిన్న దేశాలు వేసేవాడు.
ఆ తర్వాత ఎంజీఆర్ కి భక్తుడుగా మారిపోయాడు.ఆ తర్వాత కేవలం అతని సినిమాల్లో మాత్రమే నటిస్తూ వచ్చాడు చిన్నప్ప.
ఆ తర్వాత కొన్నాళ్లకు ఎంజీఆర్ ని హీరోగా పెట్టి ఒక సినిమా తీయాలని డేట్స్ అడగడం తో ఎంజీఆర్ కూడా సరే అన్నాడు.

దాంతో అతనితో తీసిన మొదటి సినిమా భార్య హిట్ అయింది.ఈ సినిమాలో సరోజా దేవిని మొదటిసారి ఎంజీఆర్ సరసన హీరోయిన్ గా నటింప చేశాడు.ఆ తర్వాత వరుసగా ఒకటి తర్వాత ఒకటి 16 సినిమాలు ఎంజీఆర్ తోనే తీస్తూ వచ్చాడు.
ఈ సినిమాల్లో దాదాపు అన్ని సినిమాలు విజయం సాధించడంతో తిరుగులేని నిర్మాతగా ఎదిగాడు.అదే సమయంలో పాపులర్ గా ఉన్న మరొక నటుడు శివాజీ గణేశన్ తో ఒక్క సినిమా కూడా తీయలేదు.
చిన్నప్ప ఇక ఎక్కువగా జంతు మరియు భక్తి రస ప్రాధాన్యత ఉన్న సినిమాలు తీయడం విశేషం.

చిన్నప్ప దేవరానికి ఒక్క ముక్క హిందీ కూడా రాకపోయినా అత్యంత ఎక్కువగా భారతదేశం ఇచ్చి రాజేష్ ఖన్నాతో హాథి మేరే సాథి అనే సినిమా తీశాడు.కేవలం నడుముకు పంచ, భుజం పైన ఒక తువ్వాలు కట్టుకొని పెద్ద హీరోల దగ్గరికి వెళ్లి వారి టేబుల్ పైన డబ్బు కట్టలు పెట్టి సినిమాకు సంతకం చేయించుకుని వచ్చేవాడు.తెలుగులో కూడా కొన్ని సినిమాలను డబ్బింగ్ చేశాడు.
ఇక తన సినిమాల్లో వచ్చిన లాభాలను నాలుగు భాగాలుగా విడదీసి మొదటి భాగాన్ని అయ్యప్ప స్వామి దేవాలయాలకు పంపించేవాడు, రెండవ భాగాన్ని తన మొదటి సినిమాకి సహాయం చేసిన స్నేహితులకు ఇచ్చేవాడు, మూడవ భాగాన్ని తానే ఉంచుకునేవాడు, నాలుగో భాగాన్ని పేద విద్యార్థుల చదువుకు ఉపయోగించేవాడు.







