ఈ రోజు టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని పుట్టిన రోజు జరుపు కుంటున్న విషయం విదితమే.మరి ఈయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో పాటు ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా నానికి బర్త్ డే విషెష్ చెబుతున్నారు.
ఈ క్రమంలోనే నాని తన స్టైల్ లో బర్త్ డే రోజు పోస్ట్ పెట్టడం ఇప్పుడు ఆసక్తిగా మారింది అనే చెప్పాలి.
ఇంతకీ నాని పెట్టిన పోస్ట్ ఏంటంటే.”నేను 1984 ఫిబ్రవరి 24న రిలీజ్ అయ్యాను.నేను గత 15 ఏళ్లలో మళ్ళీ ఇదే శుక్రవారాల్లో ప్రతీ సారి పుడుతున్నాను అని.అలాగే ఈసారి వచ్చిన శుక్రవారం బర్త్ డే లానే మీతో మరిన్ని పుట్టిన రోజులను జరుపు కోవాలని అనుకుంటున్నాను అంటూ నాని సినిమాటిక్ లెవల్లో పోస్ట్ చేయడం ఇప్పుడు ప్రతీ ఒక్కరిని ఆకట్టు కుంటుంది.

ఈ పోస్ట్ కు ఫ్యాన్స్ అంతా ఫిదా అయ్యారనే చెప్పాలి.సినిమాలోకి వచ్చి సినిమానే ప్రపంచంగా భావించే నాని ఈ పోస్ట్ తో మరోసారి తనకు సినిమా పట్ల ఉన్న మక్కువ ఏ లెవల్లో ఉందో చెప్పే ప్రయత్నం చేసి అందరు మెస్మరైజ్ అయ్యేలా చేసాడు.ఇక ఇదిలా ఉండగా నాని త్వరలోనే దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ”దసరా” సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.రా అండ్ విలేజ్ డ్రామాగా తెరకెక్కుతున్న దసరా సినిమా మార్చి 30, 2023 లో భారీ స్థాయిలో పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.ఇక ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.
సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.







