ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.సీబీఐ విచారణ పేరుతో డ్రామా జరుగుతోందని మండిపడ్డారు.
గూగుల్ టేక్ అవుట్ అనేది కొత్తగా వింటున్నామని సజ్జల తెలిపారు.సీబీఐ సొంతంగా డిఫరెంట్ లైనులో తీసుకుని వెళ్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వ సిట్ విచారణ రిపోర్టును పక్కన పెట్టేశారని మండిపడ్డారు.టీడీపీ కోరుకుంటున్న లైనులోనే సీబీఐ విచారణ జరుగుతోందన్నారు.
సీబీఐ విచారణ నిష్ఫక్షపాతంగా జరగడం లేదని ఆరోపించారు.టీడీపీ కోఆర్డినేషన్లో విచారణ జరుగుతుందని వెల్లడించారు.
నిందితులు అవినాశ్ రెడ్డి ఇంట్లో ఉన్నది నిజమయితే ఎప్పుడో బయటకు వచ్చేదన్నారు.అక్కడ అందరి ఇళ్లు.
వంద మీటర్ల దూరంలోనే ఉంటాయని తెలిపారు.వివేకా హత్య జరిగాక అనేక కథనాలు బయటకు వచ్చాయన్నారు.
కానీ హత్య జరిగినప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉందని వెల్లడించారు.ఈ క్రమంలో బీటెక్ రవి, ఆది నారాయణరెడ్డిలను సీబీఐ ఎందుకు విచారించలేదని సజ్జల ప్రశ్నించారు.







