మామూలుగా హీరోయిన్స్ మేకప్ లేకుండా బయటికి రారు.ఒకవేళ వచ్చినా కూడా కెమెరా కంట పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు.
ఒకవేళ పొరపాటున కెమెరా కంట పడితే వాళ్ళ ఫోటో వెంటనే వైరల్ అవుతూ ఉంటుంది.అయితే తాజాగా మరో నటి మేకప్ లేకుండా కనిపించగా.
అందులో తన ఫేస్ మొత్తం మారిపోయినట్లు అనిపించింది.ఇంతకు ఆ నటి ఎవరో కాదు ప్రియాంక జవాల్కర్.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ ప్రియాంక జవాల్కర్.ఈ బ్యూటీ గురించి అందరికీ పరిచయమే.
విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది.కానీ ఇందులో తన పాత్రతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
ఆ తర్వాత సినిమాలలో కూడా ఎక్కువ అవకాశాలు అందుకోలేకపోయింది.ఇక అవకాశాల కోసం తన గ్లామర్ షో చేయడం కూడా మొదలు పెట్టింది.
తన గ్లామర్ షో కి సోషల్ మీడియాని వేదికగా మార్చుకొని అందులో హాట్ ఫోటోలతో బాగా ఎక్స్పోజ్ చేస్తూ రెచ్చిపోతూ ఉంది.
ప్రియాంక మొదట షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి గుర్తింపు అందుకొని టాలీవుడ్ లో అడుగు పెట్టింది.
అలా తొలిసారిగా 2017 లో కలవరమాయే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా ఈ సినిమాతో అంతగా కూడా సక్సెస్ అందుకోలేకపోయింది.ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన టాక్సీవాలాలో నటించింది.
ఇక ఆ తర్వాత తిమ్మరుసు సినిమాలో నటించగా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.

ఇక వెంటనే వచ్చిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకోగా మంచి అభిమానం సంపాదించుకుంది.ఇక ఈ బ్యూటీ మొదట్లో చూడడానికి అంత అందంగా ఆకట్టుకోలేకపోయినా.ఇప్పుడు మాత్రం తెగ గ్లామర్ షో తో అందాల విందు వడ్డిస్తుంది.
నిజానికి గతంలో తాను తన అందం గురించి కూడా ఓపెన్ కామెంట్లు చేసింది.

తన మేకప్ వల్లే తను అందంగా ఉన్నానని తెలిపింది.తన అందం విషయంలో తను చాలా ట్రోల్స్ కూడా ఎదుర్కున్నానని.అవి తట్టుకోలేక అందం విషయంలో మరింత నాజూగ్గా, గ్లామర్ గా కనిపించాలని ప్రయత్నించినప్పుడు ఆరోగ్య సమస్యలు ఎదుర్కున్నానని తెలిపింది.
అలా ఆరోగ్యం పట్ల, శరీరం పట్ల జాగ్రత్త తీసుకొని సన్నబడినానని తెలిపింది.ఇక ప్రస్తుతం తన అందంతో బాగా గ్లామర్ షో చేస్తుంది.తెగ ఫోటో షూట్ లు చేయించుకుంటూ అభిమానులను బాగా ఫిదా చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
నిత్యం ఏదో ఒక ఫోటో తో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.

ఖాళీ సమయం దొరుకుతే తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పంచుకుంది.అయితే అందులో తను ఒకచోట పానీ పూరి తింటూ కనిపించింది.
కానీ తన ముఖం మాత్రం చాలా డిఫరెంట్ గా అనిపించింది.చూడటానికి కూడా తన ఫేస్ చాలా డల్ గా అనిపించింది.
అయితే తనకు మళ్ళీ తిరిగి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందా.లేక మేకప్ లేకుండా అలా కనిపిస్తుందా అని అనుమానం పడుతున్నారు.







