2024 పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పటినుంచే కసరత్తులు చేస్తున్నాయి ఆయా ప్రధాన పార్టీలు.ముఖ్యంగా ఈసారి ఎన్నికలు బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకే అత్యంత కీలకం.
ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి 2014 కంటే ముందు, 2014 అన్నట్లుగా మారింది.ఆ సంవత్సరంలో ఊహించని పరాభవం ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీసిందనే చెప్పాలి.2014 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తరువాత పార్టీలో అనిశ్చితి ఏర్పడడం, ఆ తరువాత అధ్యక్ష పదవి పై గందరగోళం ఏర్పడడం.ఇలా య కారణాలు కాంగ్రెస్ ను సంస్థాగతంగా దెబ్బతిశాయి.
అయితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత కంటే మోడీ మేనియా వల్లే కాంగ్రెస్ ఓటమిపాలు అయిందనేది కొందరి రాజకీయ విశ్లేషకుల వాదన.

ఇక 2019 ఎన్నికల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది.దీంతో 2024 ఎన్నికలు కాంగ్రెస్ కు డూ ఆర్ డై గా మారాయి.ఈ సారి ఎన్నికలు ఏమాత్రం బెడిసికొట్టిన కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారడం ఖాయం.
అయితే ఈసారి కాంగ్రెస్ పక్కా ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది.ఇప్పటికే రాహుల్ గాంధీ పూర్తి చేసేన భారత్ జోడో యాత్ర ఆ పార్టీకి మంచి మైలేజి తీసుకొచ్చింది.
అయితే వచ్చే ఎన్నికల్లో మోడీని గద్దె దించాలంటే కాంగ్రెస్ కు ఉన్న స్వబలం ఏ మాత్రం సరిపోదు.అందుకే ఈసారి సరికొత్త వ్యూహరచనతో కాంగ్రెస్ ముందుకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.
దేశంలోని మోడీ వ్యతిరేక పార్టీలను కూడగట్టి ఒక కూటమిగా ఏర్పాటు చేసేందుకు హస్తం అధిస్థానం సిద్దమౌతోంది.తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యాలే ఇందుకు నిదర్శనం.
వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే.విపక్షాలన్నీ ఏకం కావాలని, ఒక కూటమిగా ఏర్పడాలని ఆయన కోరారు.

ఆ కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తుందని కూడా స్పష్టం చేశారు.దీంతో కాంగ్రెస్ తో కలిసే పార్టీలు ఏవి అనే దానిపై పోలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న పార్టీలలో తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు ముందు వరుసలో ఉన్నాయి.మరి ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు ఆసక్తి చూపిస్తాయా అనేది ప్రశ్నార్థకమే.
ఇక ఇప్పటికే జేడీయూ, ఆర్ జెడి వంటి పార్టీలూ యూపీఏ కూటమిలోనే ఉన్నాయి.ఇక ఇప్పుడు కొత్తగా బిఆర్‌ఎస్ కూడా దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.మరి బిఆర్‌ఎస్ కాంగ్రెస్ కూటమి వైపు చూస్తుందా లేదా అనేది కూడా చెప్పలేము.మొత్తానికి 2024 ఎన్నికల్లో మోడీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తోంది.
మరి వచ్చే ఎన్నికల్లో దేశ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.







