ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.ఈ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ చేసింది న్యాయస్థానం.
కాగా కిడ్నీలో స్టోన్స్ ఉన్నందున సర్జరీ కోసం బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సమీర్ మహేంద్రు పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలో సమీర్ మహేంద్రుని కోర్టులో హాజరుపరిచిన ఈడీ ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని ధర్మాసనాన్ని కోరింది.
సమీర్ మహేంద్రుకు ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేస్తున్నామని పేర్కొంది.ఈ క్రమంలో పిటిషనర్ ప్రస్తావించిన సమస్య అంత జఠిలమైనది కాదని, కిడ్నీలో స్టోన్స్ కేవలం 4.4 ఎం.ఎం మాత్రమే ఉన్నాయని తెలిపింది.ఈ సందర్బంగానే గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను ఈడీ ప్రస్తావించింది.కాగా ఈనెల 28న మహేంద్రు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై సీబీఐ కోర్టు తీర్పును ఇవ్వనుంది.







