భారతదేశంలో వాయు కాలుష్యం అతిపెద్ద ఆరోగ్య సమస్యలలో ఒకటిగా మారుతోంది.దీనికి దోహదపడే అంశాలు చాలా ఉన్నప్పటికీ, వాహన ఉద్గారాలు సమస్యలో పెద్ద భాగంగా ఉన్నాయి.
దీనిని పరిష్కరించడానికి, ప్రభుత్వం 2020లో భారత్ స్టేజ్-6 లేదా BS6 నిబంధనలను అమలు చేసింది.ఆటోమోటివ్ కాలుష్య కారకాలను మరింత తగ్గించే ప్రయత్నంలో, ఏప్రిల్ 2023 నుండి BS6 ప్రమాణాల దశ IIని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలు అమల్లోకి తీసుకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ తరుణంలో టాటా మోటార్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్యాసింజర్ కార్లను BS6 ప్రమాణాల దశ-IIకి అనుగుణంగా మార్చింది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

టాటా మోటార్స్ తన ప్యాసింజర్ కార్లలో సరికొత్త మార్పులు తీసుకొచ్చింది.ప్రభుత్వం విధించిన బీఎస్-6 ప్రమాణాల రెండవ దశకు అనుగుణంగా వాహనాలను మార్చింది.టాటా టిగోర్, టియాగో, సఫారీ, హారియర్, నెక్సాన్, పంచ్, ఆల్ట్రోజ్‌లతో సహా అన్ని ప్యాసింజర్ వాహనాలను రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) అనుగుణంగా మార్పులు చేసింది.అంతేకాకుండా కంపెనీ అందించే స్టాండర్డ్ వారంటీని కూడా పెంచింది.
ఇప్పటి వరకు ఇది 2 సంవత్సరాలు లేదా 75 వేల కిలోమీటర్లు ఉండేది.దానిని 3 సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్లకు పెంచింది.

టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS)ని టియాగో, టిగోర్‌లకు టాటా మోటార్స్ సంస్థ జోడించింది.పంచ్, ఆల్ట్రోజ్ మోడళ్లకు లో-ఎండ్ డ్రైవబిలిటీ, ఐడిల్ స్టాప్-స్టార్ట్ ఫీచర్లను జోడించింది.తాజాగా విడుదల చేసిన అన్ని మోడళ్లలోనూ ఈ రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) కి అనుగుణంగా మార్పులు చేసింది.







