టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని కృష్ణా జిల్లా గన్నవరం సబ్ జైలుకు తరలించారు.నిన్నటి ఆదేశాల మేరకు వైద్య పరీక్షల రిపోర్టుతో పట్టాభిని ఇవాళ కోర్టు ఎదుట హాజరుపరిచారు పోలీసులు.
ఈ క్రమంలో పట్టాభిని సబ్ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.అయితే శాంతి భద్రతల దృష్ట్యా వేరే తరలించాలని పోలీసులు కోరగా వారి అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు.
ఈ క్రమంలో ముందస్తు అనుమతి కోరితే పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు.