ఉల్లి సాగుకు అనుకూలమైన సమయాలు.. అద్భుతమైన మెలుకువలు.. ఇవే..!

మార్కెట్ లో నిరంతరం డిమాండ్ ఉండే పంటలలో అది ముఖ్యమైనదిగా ఉల్లి పంటను చెప్పుకోవచ్చు.ఉల్లి కేవలం వంటలకే కాదు శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో దోహదపడుతుంది.

 Favorable Times For Onion Cultivation , Onion Cultivation , Agriculture , Body H-TeluguStop.com

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత మనమంతా వినే ఉంటాం.రైతులు ఉల్లి పంటను అనువైన సమయాలలో సస్యరక్ష పద్ధతులను పాటిస్తే లక్షల్లో లాభాలు గడించవచ్చు.

ఒకవేళ సరిగ్గా పద్ధతులు పాటించని ఎడల తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సిందే.

జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలను వానాకాలంగా పరిగణిస్తారు.

ఈ వానాకాలం ఉల్లిగడ్డ సాగుకు మంచి అనువైన సమయం.అయితే ఉల్లి సాగుకు అనువైన సమయం జనవరి,ఫిబ్రవరి నెలలు.

ఈ నెలలో పండించే సాగును వేసవి సాగు అంటారు వాతావరణం లో మార్పులు పెద్దగా ఉండవు కాబట్టి మంచి దిగుబడి ఆశించవచ్చు.ఇక ఉల్లి సాగుకు నీరు నిల్వ ఉండని నేలలు అయితే చాలా అనుకూలం.

నేల లక్షణాన్ని బట్టి విత్తనాలను సెలెక్ట్ చేసుకోవాలి.

Telugu Agriculture, Latest Telugu, Neem-Latest News - Telugu

ఇక ఉల్లి సాగు చేసే ఒక నెల ముందు రెండు మూడు సార్లు దుక్కి దున్ని నేలను చదును చేసుకోవాలి.తద్వారా దాదాపు కలుపు సమస్యలు ఉండవు.ఇక ఉల్లినారు నాటడానికి ముందు లీటరు నీటిలో ఫ్లూకోరాలిన్ 45 శాతం కలిపి ఎకరాకు చొప్పున పిచికారి చేసి కలియదుండాలి.

ఇక ఉల్లి సాగు చేసేముందు ఎకరాకు 80 కిలోల చొప్పున వేప పిండి పొలాలలో వేయడం వల్ల పురుగుల సమస్య ఉండదు.ఇంకా పొలంలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 65 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 24 కిలోల పోటాష్ ఎరువులు వేయాలి.

Telugu Agriculture, Latest Telugu, Neem-Latest News - Telugu

ఉల్లినాటిన రెండు లేదా మూడు రోజులలో ఆక్సి క్లోరోఫిన్ 23.5% 200 ఎం ఎల్ ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.ఇక 30 రోజులు గడిచిన తర్వాత కలుపు తీసి మట్టిని ఎగదోయాలి.ఇక 75 రోజులకు మాలిక్ హైడ్రా జైడ్ 2.5 నీటిలో కలిపి చల్లాలి.ఉల్లిగడ్డ కుళ్ళి పోకుండా 1 గ్రామ్ కర్బాండిజం ను లీటర్ నీటిలో కలిపి నారు నాటిన 100 రోజులకు పిచికారి చేస్తే ఉల్లిగడ్డ కుళ్ళిపోకుండా ఉంటుంది.

పై పద్ధతులను క్రమం తప్పకుండా పాటిస్తే ఉల్లిగడ్డ సాగులో మంచి దిగుబడి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube