బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో కియారా అద్వానీ ఒకరు.ఈమె బాలీవుడ్ లోకి ఫగ్లీ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాతో అంతగా క్రేజ్ తెచ్చుకోక పోయిన రెండవ సినిమా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ఎమ్ ఎస్ ధోనీ మూవీ భారీ విజయం సాధించింది.ఈ సినిమా విజయంతో కియారా బాలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఇక కియారా ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాతో తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా తోనే తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది.
ఇక ఈ సినిమా హిట్ అయిన వెంటనే రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో ఛాన్స్ అందుకుంది.

అయితే ఈ సినిమాతో ఈమె భారీ ప్లాప్ చవిచూసింది.దీంతో ఈమెకు మరో ఛాన్స్ అందలేదు.ఇక చాలా గ్యాప్ ఇచ్చి మరీ ప్రెజెంట్ మరోసారి రామ్ చరణ్ కు జోడీగా నటిస్తుంది.
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘RC15‘.ఈ సినిమాలోనే రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా ఇప్పటికే షూట్ చివరి దశకు చేరుకుంది.త్వరలోనే రిలీజ్ కానుంది.

ఇదిలా ఉండగా కియారా తన కెరీర్ పీక్స్ లో ఉండగానే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది.బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి ఇటీవలే రాజస్థాన్ లో పెద్దల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ స్టార్ కపుల్ ట్రెడిషనల్ వేర్ లో దిగిన ఒక బ్యూటిఫుల్ పిక్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడా ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ నూతన దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.







