కోదాడ పెద్ద చెరువు ఆక్రమణలపై చర్యలేవీ...? - సామాజిక కార్యకర్త జలగం సుధీర్

సూర్యాపేట జిల్లా:కోదాడ ఆర్డీవో ఆదేశాలను అధికారులు బేఖాతర్ చేస్తున్నారని కోదాడ సామాజిక కార్యకర్త జలగం సుధీర్ అన్నారు.మంగళవారం కోదాడలో ఆయన మాట్లడుతూ కోదాడ పెద్ద చెరువును దర్జాగా కబ్జా చేస్తున్న వారి నుండి చెరువును కాపాడాలని అఖిలపక్షం నిరసనకు దిగినఅనంతరం కోదాడ ఆర్డీవో కిషోర్ బాబు స్పందించారని అన్నారు.

 No Action On Encroachment Of Kodada Pedda Cheruvu Questions Social Activist Jala-TeluguStop.com

సుమారు సంవత్సరం క్రితం ఇరిగేషన్,రెవెన్యూ మరియు మునిసిపల్ అధికారులతో క్షేత్రస్థాయిపరిశీలన చేసి,పెద్ద చెరువు కబ్జాలకు గురైన విషయం నిజమేనని గుర్తించారని అన్నారు.

పెద్ద చెరువు కబ్జాల నివారణకు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఇరిగేషన్, రెవెన్యూ,మున్సిపల్ అధికారులను ఆదేశించారని చెప్పారు.

ఏడాది గడిచినా కానీ, ఫెన్సింగ్ వేసే పరిధి తమది కాదని ఆ 3 శాఖల అధికారులు దాటవేస్తున్నారని అన్నారు.గట్టిగా అడిగితే మా శాఖలో సరిపడా నిధులు లేవని చెప్తున్నారని అన్నారు.

ఇప్పటికైన ఈ 3 శాఖల అధికారులకు వారివారి బాధ్యతలను గుర్తు చేస్తూజిల్లా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోని, తద్వారా కోదాడ పెద్ద చెరువును కాపాడాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube