రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వల్లభనేని వంశీ అడ్రస్ లేకుండా పోతారని మండిపడ్డారు.
టీడీపీ వలనే వల్లభనేని వంశీ ఇంతకాలం బతికి బట్టకట్టారని ఎమ్మెల్యే గోరంట్ల తెలిపారు.చంద్రబాబు పిలుపునిస్తే పది వేల మందితో వంశీని చుట్టుముడతామని చెప్పారు.
వంశీ ఏ పార్టీలో ఉన్నారో సీఎం జగన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.చంద్రబాబుపై భౌతికదాడులకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
ఏపీలో మళ్లీ ఫ్యాక్షన్ పెరిగిపోయిందని తెలిపారు.







