అనంతపురం జిల్లాలోని ఎస్కేయూ రిజిస్ట్రార్ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.యూనివర్సిటీలో మృత్యుంజయ హోమం నిర్వహించాలని రిజిస్ట్రార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎస్ కే యూనివర్సిటీలో ఇటీవల పలు కారణాలతో సుమారు 25 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.వరుస మరణాల నేపథ్యంలో మృత్యుంజయ హోమం చేయాలని డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం.
ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ సర్క్యూలర్ జారీ చేశారని తెలుస్తోంది.ఈ క్రమంలో టీచింగ్ స్టాఫ్ రూ.500, నాన్ టీచింగ్ స్టాఫ్ రూ.100 ఇవ్వాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.కాగా జిల్లాలో ఈ విషయంగా సర్వత్రా చర్చ జరుగుతోంది.