నందమూరి తారకరత్న శివరాత్రి రోజు మృతి చెందడంతో ఆయన మరణం గురించి చర్చ జరుగుతోంది.శివరాత్రి రోజున మృతి చెందితే మరో జన్మ ఉంటుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
శివరాత్రి రోజున వైద్యులు సైతం తారకరత్నకు వైద్య సహాయాన్ని నిలిపివేయాలని సూచించారని తెలుస్తోంది.ఈరోజు తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయనే సంగతి తెలిసిందే.
లైఫ్ సపోర్ట్ తో తారకరత్న బ్రతుకుతాడని అందరూ భావించగా అందుకు భిన్నంగా జరిగింది.శివరాత్రి రోజు మృతి చెందిన వారు శివుని పవిత్ర ఒడిలోకి వెళతారని చాలామంది భావిస్తారు.
శివరాత్రి రోజు మరణిస్తే మరణం తర్వాత ఆత్మ శాంతియుతంగా ఉంటుందని పండితులు వెల్లడిస్తున్నారు.తారకరత్నకు ముగ్గురు పిల్లలు కాగా చిన్న వయస్సులోనే తండ్రి మరణంతో తారకరత్న కుటుంబాన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి.
బాలయ్య లేదా జూనియర్ ఎన్టీఆర్ ఆ కుటుంబానికి అండగా నిలబడితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.తారకరత్నకు ఇద్దరు కూతుళ్లు కాగా ఒక కొడుకు ఉన్నారు.తారకరత్న అలేఖ్యల మొదటి కూతురు పేరు నిష్క కాగా ఆ తర్వాత ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పుట్టారు.వాళ్లకు తారకరత్న తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టడం గమనార్హం.
ఎన్.టీ.ఆర్ అనే అక్షరాలలో ఒక్కో అక్షరంతో ఒకరి పేరు మొదలయ్యేలా తారకరత్న పేర్లు పెట్టారు.
సినిమా, పొలిటికల్ రంగాలలో సౌమ్యుడిగా తారకరత్నకు పేరుంది.తారకరత్న మృతితో నందమూరి ఫ్యామిలీలో తీరని విషాదం చోటు చేసుకుంది.తారకరత్న మృతితో సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకోగా సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
సినీ ప్రముఖులు తారకరత్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.తారకరత్న నటించిన చివరి సినిమా అతి త్వరలో రిలీజ్ కానుంది.మరో రెండు రోజుల్లో తారకరత్న పుట్టినరోజు కాగా అదే సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.