నెల్లూరు నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు పోలీసులు అరెస్టు చేశారు.విషయం తెలుసుకున్న నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వేదయపాలెం పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.
కోటంరెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకోవడంతో ఆ ప్రాంత వద్ద హైట్ టెన్షన్ వాతావరణం నెలకొంది.పోలీస్ స్టేషన్లో వెంకటేశ్వర్లు లేకపోవడంతో జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన స్పందించలేదని తెలియజేశారు.
కొద్దిసేపటి తర్వాత నగర డి.ఎస్.పి ఫోన్ చేసి వేరే పోలీస్ స్టేషన్ లో విచారణ చేపడుతున్నామని 24 గంటల్లో వెంకటేశ్వర్లను కోర్టులో హాజరు పరుస్తామని హామీ ఇవ్వడంతో కోటంరెడ్డి అక్కడి నుండి వెనుదిరిగారు.
లాయర్లతో మాట్లాడి న్యాయపోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.నాలుగు నెలల క్రితం నేరం కానిది మేము వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరం కాగానే కేసు అయ్యిందా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వెంకటేశ్వర్లని అరెస్టు చేసి కార్యకర్తల్లో భయం నింపాలని చూస్తున్నారని వారి బెదిరింపులకు ఎవరో లొంగే ప్రసక్తి లేదన్నారు.
ఇక ఇదే అంశంపై అడిషనల్ ఎస్పీ హిమావతి స్పందించారు.గత సంవత్సరం నమోదైన అట్రాసిటీ కేసులో భాగంగానే పారదర్శకంగానే ఆరెస్టులు చేపడుతున్నామని మరికొన్ని అరెస్ట్లు కూడా ఉంటాయంటూ తెలియజేశారు.
నిష్పక్షపాతమైన విచారణ చేపడుతున్నామన్నారు.