సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ” SSMB28 ” మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే.దాదాపు 13ఏళ్ల తరువాత ఈ కాంబినేషన్ మళ్ళీ సెట్ కావడంతో అందరి చూపు ఈ మూవీపై పడింది.
గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా మూవీస్ కల్ట్ క్లాసిక్ మూవీస్ గా నిలిచాయి.దాంతో మహేష్ అభిమానులు ఈ కాంబినేషన్ కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూశారు.
ఎట్టకేలకు ఈ కాంబినేషన్ ఒకే కావడంతో వారి ఆనందనికి అవధులు లేవు.అయితే ఈ కాంబినేషన్ సెట్ అయినది మొదలుకొని ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి.

గత ఏడాది సమ్మర్ లోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది.కానీ అనివార్య కారణాల వల్ల అలా జరగలేదు.ఇక తరువాత మహేష్ అన్న రమేశ్ బాబు మరణించడం తో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి మరింత ఆలస్యం కావాల్సి వచ్చింది.ఎట్టకేలకు గత ఏడాది ఆగష్టు లో లో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లి ఓ భారీ ఫైట్ సీన్ కూడా తెరకెక్కించారు.
ఆ తరువాత మహేష్ బాబు అమ్మ ఇందిరదేవి మరియు నాన్న సూపర్ స్టార్ కృష్ణ ఇద్దరు మరణించడంతో మళ్ళీ ఈ ప్రాజెక్ట్ అట్టకెక్కింది.ఇక ఇప్పుడు మొదట అనుకున్న కథ మహేష్ కు నచ్చలేదని వార్తలు వినిపించాయి.

దాంతో కథ మొత్తం మర్చినట్లు తెలుస్తోంది.మొదట షూట్ చేసిన ఫైట్ సీన్ కూడా వెస్ట్ అయినట్లు ఈ మద్య ఇంటర్వ్యూ లో నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు.దీంతో అసలు SSMB28 ఉంటుందా ఉండదా అనే అనుమానాలు అభిమానుల్లో మొదలయ్యాయి.అయితే ఇప్పుడు మహేష్ కోసం మరో కొత్త కథను త్రివిక్రమ్ రెడీ చేశారట.
అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అనేదానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు.ఇక ఈ ప్రాజెక్ట్ లో మొదట పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నారు.
అయితే కథ మారడంతో ఇప్పుడు మరో హీరోయిన్ కోసం త్రివిక్రమ్ అండ్ టీం సెర్చ్ చేస్తోందట.ఇలా మొత్తానికి మహేష్ త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్ ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ ఆధీమానులను కలవర పెడుతోంది.
మరి ఈ కాంబినేషన్ మూడవసారి ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.







