ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా మొట్టమొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రాశి ఖన్నా ఈ సినిమాలో రాశి ఖన్నా అందం అభినయానికి ప్రేక్షకులు అయ్యారు.దీంతో ఈ అమ్మడు హీరోయిన్ గా మంచి గుర్తింపు పొంది ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంది.
ఇలా తెలుగు తమిళ భాషలలో స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది.ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటుంది.
ఇలా వరుస సినిమాలలో నటిస్తూ వెండితెర ప్రేక్షకులను అలరించటమే కాకుండా ఇటీవల రుద్ర వెబ్ సిరీస్ తో డిజిటల్ ప్లాట్ ఫాంలోకి ఎంటర్ అయ్యింది.

ఇలా ప్రస్తుతం ఫర్జీ వెబ్ సిరీస్ లో ఓ లీడ్ రోల్ లో నటించింది.రాజ్ అండ్ డీకేలు తెరకెక్కించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది.ఈ వెబ్ సిరీస్ లో లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, రెజీనా తదితరులు లీడ్ రోల్స్ చేశారు.
ఈ వెబ్ సిరిస్ ప్రమోషన్స్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి ఖన్నా ఆమె పెళ్ళి వార్తల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.ఈ ఇంటర్వ్యూ లో రాశి ఖన్నా మాట్లాడుతూ.” ఫర్జీ సిరీస్ లో నేను చేసిన మేఘా వ్యాస్ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.సమంత, కీర్తి సురేష్ వంటి వారితోపాటు మరికొందరు దర్శక నిర్మాతలు కూడా కంగ్రాట్స్ చెప్పారు.

అలాగే తెలుగు, తమిళ ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.అలాగే నేను నా పెళ్లి కోసం సినిమాలకు బ్రేక్ ఇవ్వలేదు.ఇక ప్రస్తుతం తెలుగులో మూడు, తమిళంలో మూడు కథలు విన్నాను.అవి ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి.సినిమా గురించి త్వరలోనే ఒక కొత్త ప్రకటన వస్తుంది అంటూ తన పెళ్ళి వార్తల గురించి క్లారిటీ ఇచ్చింది.హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండే రాశి ఖన్నా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.ఇక ఇటీవల ఎరుపు రంగు చీరలో అందమైన గులాబీ లాగా కనిపిస్తున్న రాశి ఖన్నా ఫొటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి.







