విశాఖ కేజీహెచ్ చిన్నారి మృతదేహం తరలింపు ఘటనపై సీరియస్ అయినా నారా లోకేష్..!!

విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం ఒక విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది.అల్లూరు జిల్లాకు చెందిన దంపతుల విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి రాగా చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.

 Nara Lokesh Is Serious About The Incident Of Moving The Body Of Kgh Child Of Vis-TeluguStop.com

దీంతో మృతి చెందిన ఆ బిడ్డను సొంతూరు పాడేరు తీసుకెళ్లడానికి అంబులెన్స్ కోసం వారు అంబులెన్స్ అడిగారు.కానీ ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వడానికి నిరాకరించటంతో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరుకు తమ సొంత స్కూటీపై ఆ మృతదేహాన్ని తల్లిదండ్రులు తరలించాల్సి వచ్చింది.

ఈ తతంగం మొత్తం వీడియో రూపంలో సోషల్ మీడియాలో వెలుగులోకీ వచ్చింది.ఈ ఘటన పై రాజకీయ నాయకులతో పాటు సామాన్య జనులు మండిపడుతున్నారు.

ఇక ఇదే ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియాలో మండిపడ్డారు.” రోమ్ త‌గ‌ల‌బ‌డుతుంటే ఫిడేలు వాయించుకున్న నీరో మీకంటే బెట‌ర్ ప‌బ్జీ ప్లేయ‌ర్ గారూ! ప‌సిగుడ్డు మృత‌దేహాన్ని విశాఖ‌ నుంచి 120 కిలోమీట‌ర్లు బైకుపై పాడేరు తీసుకెళ్లిన ఆ త‌ల్లిదండ్రుల క‌ష్టం విన్న మాకే క‌న్నీళ్లు తెప్పిస్తున్నాయి.మీకు గుండె మాత్రం క‌ర‌గ‌దు.రోజుకో అమాన‌వీయ ఘ‌ట‌న‌, పూట‌కో ద‌య‌నీయ దృశ్యం మీ ద‌రిద్ర‌పాల‌న‌లో సర్వ‌సాధార‌ణ‌మైపోయాయి.వైద్యానికి వెళితే నిర్ల‌క్ష్యం.చ‌నిపోయిన వారిని త‌ర‌లించేందుకు అంబులెన్సులు రావు.

నిరుపేద‌లు చ‌నిపోతే అనాథ శవాల్లా ప‌డి వుండ‌డ‌మేనా?” అనీ ట్విట్టర్ లో లోకేష్ మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube