తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మెడికల్ కాలేజీలపై మండిపడ్డారు.
ఖమ్మం, కరీంనగర్ లో ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్నాయి.మళ్లీ ఆ జిల్లాలకే ప్రతిపాదనలు పెట్టారు.
మెడికల్ కాలేజీలు ఏ జిల్లాలో ఉన్నాయో కేసీఆర్ కే తెలియదు.ఇదే సమయంలో కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ పై జోకులు వద్దు.

2014వ సంవత్సరంలో తెలంగాణ బడ్జెట్ ₹60 వేల కోట్లు. ఇప్పుడు మూడు లక్షల కోట్ల రూపాయలు దాటింది.కేంద్ర పథకాలపై జోకులు వేయొద్దు.
ప్రధాని మేమంతా కలిసి దేశ ప్రజల కోసం పనిచేస్తున్నామని నిర్మల సీతారామన్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.పాండమిక్ వచ్చాక అందరూ అప్పులు తీసుకునే పరిస్థితికి రావడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వాలు కాదు కేంద్రం కూడా అప్పులు తీసుకునే పరిస్థితిలో ఉంది.దయచేసి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై జోకులు వేయొద్దు అంటూ.
సీఎం కేసీఆర్ పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.







