ఏపీలోని కొత్త జిల్లాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.ఈ మేరకు ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని సీఎస్ జవహర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
రేషనలైజేషన్ లేదా పదోన్నతి ద్వారా ఖాళీలు భర్తీ చేయాలని సీఎస్ తెలిపారు.రేషనలైజేషన్ ద్వారా ముందుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలు భర్తీ చేయాలని సూచించారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ-ఆఫీస్ విధానాన్ని అమలు చేయాలన్నారు.వివిధ శాఖల్లో గ్రూప్ -1, 2 స్థాయి పోస్టుల వివరాలను అందించాలని ఆదేశించారు.
అదేవిధంగా అసెంబ్లీ, కౌన్సిల్ లో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు పంపాలన్నారు.ఉద్యోగుల ఆర్థికేతర అంశాలను కూడా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.







