అలాంటివారు గురువుగా నటిస్తుంటారు... వైరల్ అవుతున్న బండ్ల గణేష్ ట్వీట్!

బండ్ల గణేష్ పరిచయం అవసరం లేని పేరు ఈయన ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.ఇక బండ్ల గణేష్ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు అంటే ఆ విషయం గురించి తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెబుతూ పలు వివాదాలలో చిక్కుకుంటూ ఉంటారు.

 Such People Pretend To Be Teachers Bandla Ganeshs Tweet Is Going Viral, Bandla-TeluguStop.com

ఇలా తరచూ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని.తనని దైవంగా భావిస్తూ ఆ దైవానికి తాను భక్తుడిగా ఉంటానని ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ జపం చేస్తూ పవన్ కళ్యాణ్ పై ఉన్నటువంటి అభిమానాన్ని బయటపెట్టారు.

తాజాగా బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.అయితే ఈయన చేసిన ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈయన చేసిన ఈ ట్వీట్ చూసినటువంటి నేటిజన్స్ బండ్ల గణేష్ కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఉద్దేశించి ఇలాంటి ట్వీట్ చేశారని భావిస్తున్నారు.పవన్ విషయంలో త్రివిక్రమ్ బండ్ల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు ఉన్న విషయం మనకు తెలిసిందే.

దీంతో ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ ను టార్గెట్ చేశారని తెలుస్తోంది.

బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ మోసం చేయాలనుకునేవారు మేధావిలా….వంచించాలనుకునేవాడు గురువుగా నటిస్తారు.కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ భక్తుడిగా పొగరుగా ఉంటాడు అది మీకు నచ్చిన నచ్చకపోయినా అంటూ ట్వీట్ చేశారు.

దీంతో ఈయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బండ్ల గణేష్ తప్పనిసరిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారు అంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇక వీరిద్దరి మధ్య భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా చిన్నపాటి మనస్పర్ధలు వచ్చిన విషయం తెలిసిందే.

దీంతో బండ్ల త్రివిక్రమ్ ను టార్గెట్ చేశారంటూ పలువురు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube