తెలుగు ఓటీటీ వరుస షో లతో దూసుకు పోతుంది.తెలుగు లో ఓటీటీ లు ఏవి కూడా రియాల్టీ షో లను కానీ టాక్ షో లను కానీ స్ట్రీమింగ్ చేసిన దాఖలాలు లేవు.
కానీ ఆహా మాత్రం వరుసగా షో లతో దూసుకు పోతుంది.సినిమా లు మరియు సిరీస్ ల కంటే కూడా ఎక్కువగా ఆహా లో టాక్ షో లు మరియు ఇతర షో లు వస్తున్నాయి.
ఈ స్థాయి లో ఆహా కు వస్తున్న ఆధరణ నేపథ్యం లో బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక షో స్ట్రీమింగ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
డాన్స్ ఐకాన్ మొన్నటి వరకు తెగ సందడి చేసిన విషయం తెల్సిందే.ఇక ఇటీవలే బాలయ్య అన్ స్టాపబుల్ షో సీజన్ 2 ముగిసింది.ఈ లోపే తెలుగు ఇండియన్ ఐడల్ ను మొదలు పెట్టేశారు.
భారీ ఎత్తున మొదటి సీజన్ కు రెస్పాన్స్ వచ్చిన నేపథ్యం లో రెండవ సీజన్ ను అదే స్థాయి లో తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.అందులో భాగంగానే చాలా మంది ప్రముఖ సింగర్స్ మరియు ప్రముఖ సంగీత దర్శకులను సీజన్ లో భాగస్వామ్యం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.
అతి త్వరలోనే తెలుగు ఇండియన్ ఐడల్ షో ను స్ట్రీమింగ్ చేస్తామని ఇప్పటికే ఆహా నుండి అధికారికంగా ప్రకటన వచ్చింది.సింగింగ్ షో ల్లో నెం.1 గా గత సీజన్ తో నిరూపించుకున్న తెలుగు ఇండియన్ ఐడల్ మరో సారి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.అన్ స్టాపబుల్ సీజన్ 2 కి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యం లో అదే స్థాయి లో ఈ షో కి కూడా మంచి స్పందన వస్తుందని ఆహా వారు ఆశిస్తున్నారు.
ఈసారి గీతా మాధురి సందడి చేయబోతున్న నేపథ్యంలో ఎక్కువ మంది షో పట్ల ఆసక్తి చూపిస్తారని ఆహా వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.